| ఆ. |
తఱచు చదువు చదువఁ దర్కవాదమె కాని
దివ్యజ్ఞాన మన్న తేటపడదు
పసిరికాయపురుగు పగిదిని చెడిపోవు
విశ్వదాభిరామ వినర వేమ. |
276 |
|
| తే. |
అవని వేమన్న చెప్పిన యాత్మబుద్ధిఁ
దెలియలేనట్టి యజ్ఞాని తేజమెల్ల
తలనుఁ బాసిన వెంట్రుకవలెను జూడ
భుక్తి ముక్తులు హీనమైపోవు వేమ. |
277 |
|
| ఆ. |
ఇట్టి సాధువిద్య యెందులేదని చూచి
గాఢవిద్య నేర్చి కానలేక
సాధుసజ్జనముల సాంగత్యమెఱుఁగక
బాధపడుదురు తుది పరులు వేమ. |
278 |
|
| ఆ. |
ఇదియ పరమటంచు నితరచింతలు వీడి
మనసుఁ జెదరనీక మట్టుపఱచి
కొదువలేక నిలువ కోర్కెలు ఫలియించు
మనసులోన నుండు మహిమ వేమ. |
279 |
|