| ఆ. |
ధనవిహీనుఁడైన తండ్రి గర్భంబున
భాగ్యపురుషుఁ డొకఁడు పరఁగఁబుట్టి
బహుళధనము గూర్చి భద్రమార్గంబున
పరుల కుపకరించి పరఁగు వేమ. |
26 |
|
| ఆ. |
ఇహమునందు బాధలెన్నైనఁ బడవచ్చు
యముని బాధలేక యమరవలెను
పరుల బాధలేక బ్రతుకుఁడీ నరులార
విశ్వదాభిరామ వినర వేమ. |
27 |
|
| ఆ. |
వల్లవైపులేక వాగ్దత్త మటుచేసి
యదిగొయిదిగొ యనుచు నాసఁబెట్టి
గడువుఁ బెట్టి రేపు గడియ కానిమ్మని
గడియలోనఁ బడియెఁ గదర వేమ. |
28 |
|
| ఆ. |
పరుల కుపకరింప పాపక్షయంబగు
పరుల కుపకరింపఁ బట్టుకొమ్మ
పరుల కుపకరింపఁ బరలోక సిద్ధియు
పరుల కుపకరింప బలిమి వేమ. |
29 |
|
| ఆ. |
అర్థవంతుల సొమ్ము నాసింతు రర్థులు
యర్థికీయ సొమ్ము వ్యర్థమౌను
వ్యర్థమైన సొమ్ము వ్యర్థులఁ జేరురా
విశ్వదాభిరామ వినర వేమ. |
30 |
|
| ఆ. |
ధర్మకంటకుండు ధనముచే గర్వించి
సకలసంపదలను జాలఁ బొరసి
కడకు తాను మేలు గానక చెడిపోవు
విశ్వదాభిరామ వినర వేమ. |
31 |
|
| ఆ. |
ఇంతి తనదుపేరు నెల్లకాలంబును
ప్రజలు దలఁచునట్టి ప్రతిభఁ గాంచె
నింతికి పతిభక్తి యెంతనవచ్చును
విశ్వదాభిరామ వినర వేమ. |
32 |
|
| ఆ. |
ధర్మమునకుఁ గీడు తలఁచినవాఁడు తా
దుష్టమార్గుఁ డవును ద్రోవ చెడును
గురువుపత్నిగవయఁ గోరెడువాఁడు తా
మొదలెచెడును ముప్పు మొనసి వేమ. |
33 |
|
| ఆ. |
అలయఁజేసి మలఁచి యడిగండ్లు మలిగండ్లు
తిరిపెమిడెడు కటికిదేబెలెల్ల
నెలమి మన్నుదినెడు నెఱ్ఱలౌదురు సుమీ
విశ్వదాభిరామ వినర వేమ. |
34 |
|
| ఆ. |
మత్సరంబు మదము మమకార మనియెడి
వ్యసనములను దగిలి మసలఁబోక
పరుల కుపకరించి పరము నమ్మిక నుండ
నొనరుచుండు రాజయోగి వేమ. |
35 |
|
| ఆ. |
దానధర్మములును దయయు సత్యము నీతి
వినయ ధైర్య శౌర్య వితరణములు
రాజుపాలిటి కివి రాజయోగంబులు
విశ్వదాభిరామ వినర వేమ. |
36 |
|
| ఆ. |
క్రొవ్వు పొట్టపొరలు క్రూరకర్ములపొరల్
నొవ్వఁ జేసినట్టి రవ్వపొరలు
నెవ్వరైన నేమి యినజువాకిటఁ గాని
యవ్వలికిని బోవునటర వేమ. |
37 |
|
| ఆ. |
లోక మరసినట్టి లోకోపకారులు
భోగభాగ్యములను బొంది తుదను
పూర్వవాసన విడిపురహరు తావున
మ్రోగుచుంద్రు తారు మొనసి వేమ. |
38 |
|
| ఆ. |
జ్ఞానమెన్న గురువు జ్ఞానహీనము బుద్ధి
రెంటిసందు రిమ్మరేచు నపుడు
రిమ్మ తెలిసెనేని రెండొకరూపురా
విశ్వదాభిరామ వినర వేమ. |
39 |
|
|
|
| క. |
సకలాకారుఁ డనంతుఁడు
సకలాత్ములయందు సర్వసాక్షియుఁ దానే
సకలమున నిర్వికారుం
డకలంకస్థితిని బ్రహ్మ మగునుర వేమా. |
41 |
|
| క. |
నే నెవ్వండని వలపడు
మానసమునఁ బుడమిలోని మనుజుండటరా
కానడు తనశవమును దా
మానుగఁ గనుగొనుట యెట్లు మహిలో వేమా. |
42 |
|
| ఆ. |
జనుఁడు తెలివినొంద చంచలింపదు మది
దయయు దైవమొగిని దగులు బుద్ధి
తివురుభానుఁ జూచి తిమిరంబు నిలుచునా
విశ్వదాభిరామ వినర వేమ. |
43 |
|
| ఆ. |
పగలురేయి మఱచి భావంబు మఱచియుఁ
దాను నేననియెడు తలఁపు మఱచి
యుండువాని నెంచ నుత్తమయోగిరా
విశ్వదాభిరామ వినర వేమ. |
44 |
|
| ఆ. |
మంటలోహమందు మ్రాకులు శిలలందు
పటము గోడలందుఁ బ్రతిమలందు
తన్నుఁ దెలియుకొఱకు తగులదా పరమాత్మ
విశ్వదాభిరామ వినర వేమ. |
45 |
|
| ఆ. |
మనసులోనివాని మానుగాఁ దెలిసిన
నుర్విజనులువాని యోగి యండ్రు
నీవె నిన్నెఱుంగ నీవెపో శివుఁడవు
విశ్వదాభిరామ వినర వేమ. |
46 |
|
| ఆ. |
మాటలోనివాని మహిమఁ దాఁ దెలియక
మాటబయలె లేక మమతఁ జిక్కె
మాట దెలిసెనేని మఱియాత్మ యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ. |
47 |
|
| ఆ. |
వ్రేయవ్రేయనదియ విత్తన మనిపించు
వ్రేయవ్రేయఁ బ్రబల వృక్షమగును
తెలియఁ దెలియవాఁడు దేవుఁడనందగు
విశ్వదాభిరామ వినర వేమ. |
48 |
|
| క. |
గడనగల పురుషుఁ గనుగొని
యడుగులకును మడుగు లిడుదు రతివలు ధరలో
గడన విడుపురుషుఁగనుగొని
నడపీనుగ వచ్చెనండ్రు నాతులు వేమా. |
49 |
|
| ఆ. |
వంటదప్పునపుడు వంటకము విషంబు
కంటఁ జూడఁగానె కంటగించుఁ
గంటకమునఁ దిన్నకడి గండమైవచ్చు
విశ్వదాభిరామ వినర వేమ. |
50 |
|