| ఆ. |
శ్రీకరశివతత్వశీలుఁడౌ వేమన
ప్రాకటముగ వేయు పద్యములను
లోకమందుఁ జదివెలోవెతఁ బాయరో
విశ్వదాభిరామ వినర వేమ. |
201 |
|
| ఆ. |
వేయుపద్యముల వివేకియై భక్తితోఁ
బఠనఁ జేసినట్టి భక్తులకును
బాయకుండు మోక్షపద మరచేతిదై
విశ్వదాభిరామ వినర వేమ. |
202 |
|
| క. |
శతసంఖ్యపదమ్ముల నే
మతిమంతుఁడు పఠనసేయు మమతులు దీరు
న్నతఁడే నాలుగుపదముల
శితికంఠునిపదముఁ జేరు సిద్ధము వేమా. |
203 |
|
| క. |
ఎన్నఁగ మనసే కారణ
మన్నిటికిని జూడఁజూడ నాత్ముఁడు తానై
యున్నంతకాలమెచ్చట
నున్నను నిది నిజముఁ దెలియ నొప్పగు వేమా. |
204 |
|
| క. |
సర్వము తానని తెలిసిన
నిర్వాణికిఁ గాక ముక్తి నిలుపఁగ వశమా
ఉర్వెల్లఁ దాను తిరిగిన
పర్వత బిలజలధులందుఁ బడినను వేమా. |
205 |
|
| క. |
చదువులఁ జదివినవారలు
పదవిన్ని బొందంగ లేరు పరమార్థముగాఁ
బెదవులఁ గదలక యుండిన
మదిలో నది రాజయోగమహిమము వేమా. |
206 |
|
| చ. |
తలపఁగ మూలమందు పరతత్త్వము దెల్పఁగ పాటుగాదు లో
బలిమిని నాత్మగుట్టు మది భావననెంచగ బ్రహ్మకల్పము\న్
గలుగును ముక్తి జీవులకుఁ గావున నాత్మవిధానదృశ్య మీ
సలలిత శక్తిరూపు నిను సన్నుతి వేమన చేసె కల్పమున్. |
207 |
|
| ఆ. |
ఆకు చాటునుండు నన్నిలోకంబులు
కొమ్మ గానరాదు బ్రహ్మకైన
కొమ్మ గానఁబడినఁ గొనియాడవచ్చురా
విశ్వదాభిరామ వినర వేమ. |
208 |
|
| చ. |
పిలిచినఁ బల్కకుండు మరి పిల్చిన నేమనకూరకుండుఁ ద\న్
దలఁచిన నెవ్వ రేమనినఁ దన్నునుగాదని నవ్వుచుండు నా
త్మలఁ దలపోయుచుండు నెఱ తత్వము నిత్యము దానయై సదా
తెలిసినయోగి వేమనగతి\న్ శివరూపుఁడు నెల్లతావుల\న్. |
209 |
|
| ఉ. |
ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయె
వేఱొక్కఁడు భోగి యాయెనటు నొక్కఁడు చక్కనియోగి యాయెఁ
దా నొక్కఁడు రాగియాయె నినుబోలు మహాత్మునిఁగాన మెచ్చట\న్
నిక్కము నిన్నిరూపములు నీకును జెల్లుగదన్న వేమనా. |
210 |
|
| క. |
విషయములు తెరలపొలుపున
విషయము లంటక మహాత్ము విధమున ధరలో
విషసంసారము లన్నియు
విషయము లన్నియును గెల్వ వేమన నేర్చు\న్. |
211 |
|
| క. |
కాదని యెవ్వరి తోడను
వాదాడక దిరుగు వెఱ్ఱివాఁడును వలెనే
భేదాభేదము లడచును
వేదాంత రహస్య మెల్ల వేమన నేర్చు\న్. |
212 |
|
| ఆ. |
దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక
మనము నమ్మెనేని మాయ గల్గు
జ్ఞానకలిక నమ్మఁ జంపును వైరుల
విశ్వదాభిరామ వినర వేమ. |
213 |
|
| ఆ. |
ఎందు నెఱుకవాని కిహపరములు లేవు
ప్రాణహానిలేదు ప్రళయమునను
ప్రళయకాలమైనఁ బరమాత్ముఁ గలయురా
విశ్వదాభిరామ వినర వేమ. |
214 |
|
| ఆ. |
దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె
దేహితోడ నెపుడు దేహమందె
వాహనముల నెక్కి వడిఁదోలు మన్నాఁడు
విశ్వదాభిరామ వినర వేమ. |
215 |
|
| ఆ. |
సొమ్ము దొరకుదనుక జ్యోతి యంతియెకాక
సొమ్ము దొరకునెనక జ్యోతి యేల
దేవుఁడైన వెనుక దేహంబు మఱియేల
విశ్వదాభిరామ వినర వేమ. |
216 |
|
| ఆ. |
గురుచరణముఁ బట్టఁ గుక్కలు గఱచును
గురుచరణము విడువఁ గుక్క గఱచుఁ
గుక్కకున్న బుద్ధి గురునకు లేదురా
విశ్వదాభిరామ వినర వేమ. |
217 |
|
| ఆ. |
ఆత్మబుద్ధివల్ల నఖిలంబు తానయ్యె
జీవబుద్ధివలన జీవుఁడయ్యె
మోహబుద్ధినియము ముందరఁ గనుగొని
విశ్వదాభిరామ వినర వేమ. |
218 |
|
| క. |
ఈ దేహ మన్నిభంగులఁ
బ్రోచియు నొనరంగ నేలపోవుట కాదె
మీఁదెఱిగి మురికి గడుగను
భేదంబులు మాన ముక్తి బెరయుర వేమా. |
219 |
|
| ఆ. |
పిల్లి యెలుకబట్టఁ బ్రియమున నుండగ
నదియు కోడిఁబట్ట ననుగమించు
మమత విడువకున్న మానునా మోహంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
220 |
|
| క. |
ఏక బ్రహ్మము నిత్యము
వైకల్పితమైనయట్టి వస్తువులెల్ల\న్
నేకత్వంబని యెఱిగిన
శోకము లేనట్టిముక్తి సులభము వేమా. |
221 |
|
| ఆ. |
మహిని దధిని ఘృతము మ్రానులం దనలంబు
సౌరుసుమములందు సౌరభంబు
తిలలఁ దైలమట్ల తేజరిల్లుఁ జిదాత్మ
విశ్వదాభిరామ వినర వేమ. |
222 |
|
| ఆ. |
తరువఁ దరువఁ బుట్టు దరువున ననలంబు
తరువఁ దరువఁ బుట్టు దధిని ఘృతము
తలఁప దలపఁ బుట్టు తనువునఁ దత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
223 |
|
| క. |
జీవుని దెలిసిన దనుకను
దేవుని భ్రమఁ బొదలు నరుఁడు దేవుఁడు దలఁప\న్
జీవుండని వివరించిన
భావింపగ ముక్తి బట్టబయలుర వేమా. |
224 |
|
| ఆ. |
ఇంతకాలముండి యెఱుకమాలినజీవి
చచ్చిపుట్టుచుండు సహజమనుచు
నెఱుక మఱచుచోట నెఱుఁగునా బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
225 |
|