| ఆ. |
పుత్తడిగలవాని పుష్ట్రంబు పుండైన
వసుధలోన చాల వార్త కెక్కు
పేదవానియింట పెండ్లయిన నెఱుఁగరు
విశ్వదాభిరామ వినర వేమ. |
351 |
|
| ఆ. |
విద్దెదానిపొందు విడువఁ జాలక తుల్వ
చచ్చుదాఁకమోయు చాపగుడిసె
భాగవతులపట్టు పట్టంగ నోపఁడు
విశ్వదాభిరామ వినర వేమ. |
352 |
|
| క. |
అనఘ పురుషుండు నొక్కఁడు
విను నిత్య మనిత్యమనెడివిధ మిట్టి దగు\న్
తన సంకల్పమె బంధము
తన సంకల్పక్షయంబె తత్వము వేమా. |
353 |
|
| ఆ. |
అమలమైన పలుకు లభిషేకవారిధి
తనువు దేవళంబు తాల్మి నొంది
యాత్మ శివునిఁజేర్చు నాతఁడే శివయోగి
విశ్వదాభిరామ వినర వేమ. |
354 |
|
| ఆ. |
ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు
మృతిని గెలువలేని యెఱుఁకలేక
దొంగరీతి కాఁగ దొరుకునో మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
355 |
|
| ఆ. |
ఎట్టిరూపుఁ జూడ నీరూపు కనిపించు
నీదురూపుఁజూడ నెగడుఁ దెలివి
హెచ్చు తెలివి యున్న నీశ్వరుఁ డేతోఁచు
విశ్వదాభిరామ వినర వేమ. |
356 |
|
| ఆ. |
తెలివియైనలేక తిరమును తెలియక
తిరుగునస్థిరుఁ డయి దేహి జగతి
తిరుగ నేల యనుచుఁ దెలియఁడా యజ్ఞాని
విశ్వదాభిరామ వినర వేమ. |
357 |
|
| ఆ. |
తపముజపములెన్నొ ధాత్రిజనుల కెల్ల
నొనర శివునిఁజూడ నుపమగలదు
మనసుఁజెదరనీక మదిలోనఁజూడరో
విశ్వదాభిరామ వినర వేమ. |
358 |
|
| ఆ. |
మతము లెన్నియైన సతముగా నుండవు
సతము కర్మముండు జగతి నొకటి
ఆమతముల విడిచి యా బ్రహ్మమరయుము
విశ్వదాభిరామ వినర వేమ. |
359 |
|
| ఆ. |
కోమటినిష్ఠలు గుఱికి రావెన్నఁడు
లోభగుణము చేతలోని కడఁగు
పులియు దాసరి కీడుపొలువగు చందమౌ
విశ్వదాభిరామ వినర వేమ. |
360 |
|
| ఆ. |
గోపురములు గుడ్లు కోనేర్లు తేరులు
ఆకు లసురుగుడులు నడలఁగాను
నేఱు వంతదిఱిఁగియెగఁ బట్టుకొనెనయా
విశ్వదాభిరామ వినర వేమ. |
361 |
|
| ఆ. |
చెట్టఁబట్టువెనుక చేతాఁకువై యుండు
రంతకాఁడు గట్టి పగఱకండ్రు
ఆఁడువారికింత యడఁగుట చెల్లదో
విశ్వదాభిరామ వినర వేమ. |
362 |
|
| ఆ. |
తల్లిదండ్రులెన్నఁ దనతొలి గురులు
పార్వతీభవులును పరమగురువులు
కూలివాండ్ర జగతి గురు లన ద్రోహంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
363 |
|
| క. |
నవ్వును చదువును పాడును
నొవ్వక తానిట్లు మెచ్చు నుడువును మఱచు\న్
నివ్వటిలియుండు ముదిమియు
నివ్విధమునఁ జూడఁజూడ నెవ్వడు వేమా. |
364 |
|
| ఆ. |
నీళ్ళమీఁదజూడు నెఱయ నోడలబల్మి
బట్టబయలఁ జూడు బండిబలిమి
ఆఁడుదాని బలిమి నాడనే చూడరా
విశ్వదాభిరామ వినర వేమ. |
365 |
|
| క. |
నే నెఁవడను తలపెట్టఁగ
మానసమునఁ దలపకున్న మనుజుని కకటా
కానఁబడు పడకముందే
మానుగఁ గనుగొనఁగవలయు మహిలో వేమా. |
366 |
|
| ఆ. |
బ్రతుకు నిత్య మనుచుఁ బదరుచు వగమీఱ
విఱ్ఱవీఁగువారు వెఱ్ఱివారు
ప్రాణులెల్ల యమునివారి గొఱ్ఱెలుసుమీ
విశ్వదాభిరామ వినర వేమ. |
367 |
|
| ఆ. |
బ్రహ్మవాదు లెల్ల బ్రహ్మంబనంగను
వలను తెలిసిచూడ వద్దనుండు
ముందునున్న యట్టి ముద్రిక కానరో
విశ్వదాభిరామ వినర వేమ. |
368 |
|
| ఆ. |
మదిని గానవలెను మఱిబ్రహ్మమూర్తిని
మదినిగన్నవారు మహినిలేరు
వెదకి తనువులోన వేడ్కతో నెఱిఁగిన
యతఁడె యోగివరుఁడు నగును వేమా. |
369 |
|
| క. |
మనసనలము రెంటికినిల
ఘనమును కొంచెంబుఁ దెలియఁగావలె సుమ్మీ
కనుమూసి తెరచినంతనె
ఘనమై విహరించుమనసుఁగానరు వేమా. |
370 |
|
| ఆ. |
మర్మ మెఱుఁగలేక మతములఁ గల్పించి
యుర్విదుఃఖు లగుదు రొకరి కొకరు
గాజువంటిఁ గుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ వినర వేమ. |
371 |
|
| ఆ. |
ఇహపరాదులకును నిది సాధనం బని
వ్రాసి చదివి విన్నవారికైన
మధ్యమకర్మములు మహిమతో నడచును
బడుగుకైన ముక్తిపదము వేమ. |
372 |
|
| ఆ. |
వేదవిద్య గాదు వీరవిద్యయుఁ గాదు
బాధవిద్యయుఁగాదు పరపు గాదు
మధురమైన యట్టి మనసు నిల్పెడివిద్య
సాధువిద్య యెన్న సరస వేమా. |
373 |
|
| ఆ. |
వేయువిధము లమర వేమనపద్యంబు
లర్థ మిచ్చువాని నరసి చూడ
చూడఁజూడఁ గలుగుచోద్యమౌ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
374 |
|
| క. |
వేమన పద్యము లన్నిటి
సామంబునఁ జదివినట్టి సజ్జను లెల్ల\న్
సోమనతల సుందరు కడు
నేమంబునఁ జూడరయ్య నేర్పున వేమ. |
375 |
|