| ఆ. |
పర్వత వనవాసి పరిణామ వర్తన
కూపవాసి కెట్టు గుఱుతుపడును
బ్రహ్మవిష్ణువెంటఁ బ్రాకృతుఁ డరుగునా
విశ్వదాభిరామ వినర వేమ. |
151 |
|
| ఆ. |
కస్తూరి యటుచూడఁ గాంతి నల్లగనుండు
పరిమళించుదాని పరిమళంబు
గురువులయినవారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినర వేమ. |
152 |
|
| ఆ. |
దొంగతనము ఱంకు దొరసియుండుర జగతి
ఱంకులాడికింత శంకపుట్టు
దొంగకన్న ఱేవెలుం గొప్పకానట్లు
విశ్వదాభిరామ వినర వేమ. |
153 |
|
| ఆ. |
గురువులేక విద్య గుఱుతుగా దొరకదు
నృపతిలేక భూమి తృప్తిగాదు
గురువు విద్యలేక గురుతర ద్విజుఁడౌనె
విశ్వదాభిరామ వినర వేమ. |
154 |
|
| ఆ. |
అల్పసుఖములెల్ల నాశించి మనుజుండు
బహుళ దుఃఖములను బాధపడును
పరసుఖంబు నొంది బ్రతుకంగ నేరఁడు
విశ్వదాభిరామ వినర వేమ. |
155 |
|
| ఆ. |
కాలవశముఁ బట్టి కర్మజీవులపిండు
మత్తులగుచును మదమత్తులైరి
మత్తులయిన జనుల మనసేటి మనసయా
విశ్వదాభిరామ వినర వేమ. |
156 |
|
| ఆ. |
కడగివట్టియాస కడతేఱనీయదు
ఇడుములందుఁ బెట్టి యీడ్చుఁగాని
పుడమి జనులభక్తిఁ బొడమంగ నియ్యదు
విశ్వదాభిరామ వినర వేమ. |
157 |
|
| ఆ. |
పాలలోన బులుసు లీలతోఁ గలిసిన
విఱిసి తునుక లగును విరివిగాను
తెలివి మనసులోన దివ్యతత్త్వము తేట
విశ్వదాభిరామ వినర వేమ. |
158 |
|
| క. |
దేహము లెస్సగ నుండిన
పోషణ తత్వంబులన్ని పొందుగఁ దెలియు\న్
దేహము బడలికఁ బడినను
పోషణ తత్వములు వచ్చి పొందవు వేమా. |
159 |
|
| ఆ. |
అధికుడైనరాజు నల్పును చేపట్టు
వానిమాట చెల్లు వసుధలోన
గణికు లొప్పియున్న గవ్వలు చెల్లవా
విశ్వదాభిరామ వినర వేమ. |
160 |
|
| ఆ. |
ధర్మమరసి పూని ధర్మరాజాదులు
నిర్మలంపు ప్రౌఢి నిలుపుకొనిరి
ధర్మమే నృపులకు తారకయోగంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
161 |
|
| ఆ. |
దానములను జేయఁ దన చేతులాడక
బహుధనంబుఁగూర్చి పాతిపెట్టు
తుదను దండుగ నిడు మొదలు చేర్చునరుండు
విశ్వదాభిరామ వినర వేమ. |
162 |
|
| క. |
నిత్యంబు కానియొడలికి
నిత్యము దుఃఖమునఁబడును నిరతము ధరలో
నిత్యానందపు పదవికి
నిత్యంబును దుఃఖపడఁగ నేరదు వేమా. |
163 |
|
| ఆ. |
విను వివేకమనెడి వింతగొడ్డలిచేత
వలయవిద్యయనెడు నడవి నఱికి
తెలివియనెడుగొప్ప దీపంబు చేఁబట్టి
ముక్తిఁ జూడవచ్చు మొనసి వేమ. |
164 |
|
| క. |
ఎక్కడిసుతు లెక్కడిసతు
లెక్కడిబంధువులు సఖులు నెక్కడి భృత్యుల్
డొక్కువడి పోవు వేళలఁ
జక్కటికిని నెవరురారు సహజము వేమా. |
165 |
|
| ఆ. |
పాలనీరుక్రమము పరమహంస యెఱుంగు
నీరుపాలక్రమము నెమలి కేల
అజ్ఞుఁడయినవాఁడు నలశివు నెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ. |
166 |
|
| ఆ. |
కన్నులందు మదము గప్పి కానరుగాని
నిరుడు మీదటేఁడు నిన్న మొన్న
దగ్ధులయిన వారు తమకంటెఁ దక్కువా
విశ్వదాభిరామ వినర వేమ. |
167 |
|
| క. |
దీపంబు లేని యింటను
రూపంబును దెలియలేరు రూఢిగఁ దమలో
దీపమగు తెలివి గలిగియు
పాపంబుల మఱుగుత్రోవఁ బడుదురు వేమా. |
168 |
|
| ఆ. |
ఏరుదాఁటి మెట్ట కేగినపురుషుండు
పుట్టి సరుకుగొనక పోయినట్లు
యోగపురుషుఁడేల యొడలిఁ బాటించురా
విశ్వదాభిరామ వినర వేమ. |
169 |
|
| ఆ. |
మంటికుండవంటి మాయాశరీరంబు
చచ్చు నెన్నడయినఁ జావఁ డాత్మ
ఘటము లెన్నియైన గగనంబదేకమే
విశ్వదాభిరామ వినర వేమ. |
170 |
|
| ఆ. |
మాయను చెఱసాల మనమను గొలుసును
భేదమనెడుబొండ బెరసియుండు
ఇట్టిబద్ధజీవి కెన్నడు మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
171 |
|
| ఆ. |
ఎఱుకకన్నను సుఖమే లోకమునలేదు
ఎఱుకనెఱుఁగ నెవని కెఱుకలేదు
ఎఱుకసాటి ఎఱుక యేతత్వమున లేదు
విశ్వదాభిరామ వినర వేమ. |
172 |
|
| క. |
కనియుండి కానలేరట
వినియుండియు వినగలేరు విస్మయమేమో
కనుగ్రుడ్డియు వినుచెవుడుం
చనునది నిజమయ్యె జగమునందున వేమా. |
173 |
|
| ఆ. |
ఊరకుంట దెలియ నుత్తమయోగంబు
మానసంబు కలిమి మధ్యమంబు
ఆసనాది విధుల నధమ యోగంబురా
విశ్వదాభిరామ వినర వేమ. |
174 |
|
| ఆ. |
మనసుసూచి గెల్చి మనసులో సుఖియించి
కడకు మోక్షపదము గనునువాఁడు
చెట్టుఁబెట్టు ఫలము చేకూర కుండునా
విశ్వదాభిరామ వినర వేమ. |
175 |
|