| శతకములు | సుమతి శతకము |
|
| క. |
పరనారీసోదరుఁడై పరధనముల కాసపడక పరులకు హితుఁడై పరులు దనుఁ బొగడ నెగడియు పరులలిగిన నలుగనతఁడు పరముఁడు సుమతీ! |
71 |
| క. |
పరసతి కూటమిఁ గోరకు పరధనముల కాసపడకు పరునెంచకుమీ సరిగాని గోష్ఠి సేయకు సిరి చెడిఁ జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ! |
72 |
| క. |
పరసతుల గోష్ఠినుండిన పురుషుడు గాంగేయుఁడైన భువి నిందబడున్ బరసతి సుశీలయైనను బరుసంగతి నున్న నిందపాలగు సుమతీ!73 |
|
| క. |
పరు నాత్మఁ దలఁచు సతి విడు మఱుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ వెఱపెఱుఁగని భటు నేలకు తఱచుగ సతిఁ గవయఁబోకు తగదుర సుమతీ! |
74 |
| క. |
పరుల కనిష్టము సెప్పకు పొరుగిండ్లకుఁ బనులులేక పోవకుమెపుడున్ బరుఁ గవిసిన సతి గవయకు మెఱిఁగియు బిరుసైన హయమునెక్కకు సుమతీ! |
75 |
| క. |
పర్వముల సతులఁ గవయకు ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో గర్వింప నాలిఁ బెంచకు నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ! |
76 |
| క. |
పలు దోమి సేయు విడియము తల గడిగిన నాఁటినిద్ర తరుణుల తోడన్ బొల యలుక నాఁటి కూటమి వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ! |
77 |
| క. |
పాటెఱుగని పతికొలువును గూటంబున కెఱుకపడని కోమలి రతియున్ బేఁటెత్తఁజేయు చెలిమియు నేటికి నెదురీఁదినట్టు లెన్నర సుమతీ! |
78 |
| క. |
పాలను గలసిన జలమును బాల విధంబుననె యుండుఁ బరికింపంగాఁ బాల చవిఁ జెఱచుఁ గావున బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ! |
79 |
| క. |
పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకున్ దేలగ్నిఁ బఁడగఁ బట్టిన మేలెఱుఁగునె మీటుఁగాక మేదిని సుమతీ! |
80 |