| శతకములు | ఆంధ్రనాయక శతకము |
|
| సీ. |
మొసలిఁ బెట్టినకస్తి మొఱ్ఱ బెట్టినహస్తి- రక్కరించితి నన్నరంబె మేమి? తులువ పల్వురిలోన వలువ నిప్పంగ జాన- సిగ్గుఁ గాచితి నన్నపగ్గె యేమి? బలువు శాపముచేత బండపాఱిననాఁతి- ఱంకుఁ బాపితి నన్న బింక మేమి? పెద్ద మోదినభీతి బెగడి వచ్చినకోఁతి- కండ జేసితి నన్న యంద మేమి? |
|
| తే. |
భవభయంబున నిన్నెంత ప్రస్తుతింపఁ-గరుణఁ జేపట్ట లేని నీ ఘనత యేమి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
81 |
| సీ. |
నీచువాసనచేత నీటిలో నుండుట- యెక్కువప్పులను రా యెత్తుకొనుట కడుపాఁకటికిఁ దుంగకాయలు మెక్కుట- యని నోరు దెఱచి పెల్లఱచుచుంట సిరి గల్గి బిచ్చపుఁ జిప్పఁ జేపట్టుట- చేకత్తి పరరాజుచేతి కిడుట పట్టణప్రజకుఁ జెప్పక పాఱిపోవుట- కలు ద్రావి నిను నీవె దెలియకుంట |
|
| తే. |
మ్రానువై యుంట గుఱ్ఱపుమనిసి వంట-పుడమి నాడిక సేయక విడువ నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
82 |
| సీ. |
ఖరు నాజిలోఁ జొచ్చి శర ముచ్చి పో నేయ- వెనుకకు లంఘించి వెఱచె ననిరి యనిఁ బాఱునో కోఁతి యతి మ్రానిమాటున- నేయ వాలినిఁ బొంచి యేసె ననిరి గరుడధ్వజుం డన్న గురుతుఁ దెల్పుట కున్న- బలభీతి శస్త్రాహి బద్ధుఁ డనిరి బలినిఁ జంపఁగ రానివరమున యాచింప- వృత్తి నాతని భిక్ష మెత్తె ననిరి |
|
| తే. |
యశ మదెంతొ ప్రయాస లభ్యంబె కాని-యెంతలో వచ్చు నపకీర్తి యెఱుఁగ వేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
83 |
| సీ. |
ఘోరకబంధుదీర్ఘోరుదోర్దండముల్- తరిగి వచ్చిన మాట తథ్య మేని పంఙ్క్తికంఠాత్మజ ఫణిరాజబంధమో- చనుఁడ వై వచ్చుట సత్యమేని మైరావణాభేద్య కారాగృహముఁ గూల్చి- బ్రదికి వచ్చినపల్కు భద్రమేని మారీచు దుస్తరమాయాభ్రమతఁ బాసి- విజయ మొందినసుద్ధి నిజమ యేని |
|
| తే. |
కలిత రాజోపచార భోగములఁ గీర్తి-శాలి పై యిందు మెఱయుట సాక్షి జగతి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
84 |
| సీ. |
నీ శాంతి యంభోధి నిర్భరాంబువులు బా- ణముఖంబునకుఁ దెచ్చు నాఁడె తెలిసె నీ కోప మరి రావణైకానుజన్ము నా- నగరి రాజుగఁ జేయు నాఁడె తెలిసె నీ కీర్తి కపటదుర్నితుఁడౌ ధ్వాంక్షదా- నవు తప్పుఁ గాచిన నాఁడె తెలిసె నీయభిజ్ఞత యవినిందిత నీతన్వి- నగ్నినిఁ జొరు మన్న యపుడె తెలిసె |
|
| తే. |
నెంచరాని గుణాఢ్యుఁడ వీవె యనుచుఁ-దెలిసి మ్రొక్కెద నితర మౌ దిక్కు లేక చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
85 |
| సీ. |
జనకువాక్యమున రాజ్యవిసర్జనమె కాని- యడరు శౌర్య మొకింత విడిచినావె? దీక్ష నాభరణము ల్దివియు మాత్రమె కాని- వర ధనుర్బాణము ల్వదలినావె? వ్రత మని కాంచనాంబరముఁ గట్టవు గాని- బిగువు వజ్రాంగి మై విదచినావె? ప్రతినఁ బరార్థమే మితర మొల్లవు గాని- యభిమానధనముపై నలిగినావె? |
|
| తే. |
నిఖిల రక్షోవిదారణ నిర్భయాంక-వేషధారివి నీ మునివృత్తి యేమి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
86 |
| సీ. |
వెఱపించఁ గలవొ చేవిలు నీ కొసంగి తా- విగతరోషుం డైన విప్రవరునిఁ గట్టించఁ గలవొ సాగరముపై సేతువు- మలలఁ గోఁతులమూక లలరఁ బట్టి ఘనత నీఁ గలవొ యన్నను గొట్టి తమ్మున- కారాజ్య మా చంద్రతారకముగ వేంచేయఁ గలవొ విన్వీథిఁ దేరగ నున్న- పుష్పకం బెక్కి నీపురికి మరల |
|
| తే. |
జగతి నిటు సంతతోత్సాహచరణమునకు-యుక్తి సేయుదు వోహొ నీ శక్తి దెలిసె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
87 |
| సీ. |
ని న్నెదుర్కొన రాని నెపమునఁ గోపించి- గోపితహితు నూతుఁ గొట్టవలెనె? సంబంధినోటఁ గొంచెపుమాట రా వాని- కరిపురం బలుకఁ బెకల్పవలెనె? నిను జూచి వేడ్క నొందిన గర్వముగ నెంచి- నిండి పాఱెడు నీరు నిలుపవలెనె? చెలికానివలె నొద్దఁ చేరి యెత్తుకొనంగఁ- గినుకఁ ప్రలంబునిఁ దునుమవలెనె? |
|
| తే. |
ఎంతరోసంబు గలవాఁడ వేమి నీవు-తెలివికాఁడవె బలరామ! తెలిసె నిందు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
88 |
| సీ. |
పరపురుషాకృత గురుతుగాఁ జూడక- త్రిపుర పతివ్రతాతిలకములను విటపయుక్తి భ్రమించి విఫలభ్రమతఁజేసి- తత్సతీపతుల దుర్దాంతబలుల హతము సేయించితి వల మహానటునిచే- రథారధాంగాశ్వసారథిశరాన గుణనిషంగాస్త్రము ల్కోరినట్లుండు నే- సమకూర్చి యసురుల సంహరించి |
|
| తే. |
సాహసుఁడ వైతిని న్నుంచి శంకరుండు-త్రిపురసంహరుఁ డను నాఖ్యఁ దెచ్చుకొనియె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
89 |
| సీ. |
సకల వర్ణంబులు సంకరంబులు జేసి- యఖిల ధర్మములు శూన్యములు సేసి భూతలంబును బాపభూయిష్ఠముగఁ సేసి-పరగఁ బ్రపంచంబు భ్రష్టు సేసి కలి విజృంభించిన కడపటనా నీవు- తురగవాహనుఁడ వై దోర్విరాజి ఖడ్గచంచద్ధారఁ గలుషాత్ముల వధించి- శిష్టసంరక్షణ సేయు టెల్ల |
|
| తే. |
ననిశము చరాచరాది జీవావనైక-జాగరూకుఁడవా నీవు జాగు దెలిసె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
90 |