| శతకములు | ఆంధ్రనాయక శతకము |
|
| సీ. |
భిల్లాంగనాదంతపీడిత ఫలభుక్తి- హేయంబు దోఁచలే దింత నీకు సంక్రందనాత్మజ స్యందన సారథ్య- మెరుసుగాఁ దోఁచలే దింత నీకు గోపాలకానేక గోవత్సపాలనం- బెగ్గుగాఁ దోఁచలే దింత నీకు వ్రజబాలికా ముక్తవస్త్రాపహరణము- హీనమై తోఁచలే దింత నీకు |
|
| తే. |
నుచ్చనీచంబు లెఱుఁగక యిచ్చఁ జేయు-చేష్ట లివి భక్తహితమతిఁ జేసి తండ్రు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
21 |
| సీ. |
విమతభూపతు లెట్లు విముఖులై పాఱిరో- రాజపీఠం బెక్కరాని నీకు కుంభినీధవు లెట్లు కూఁతుండ్ర నిచ్చిరో- కుల మొల్లకయె నీకు గోపకునకు సుందరీమణు లెట్లు చూచి మోహించిరో- క ప్పగు మైచాయ గలుగునీకు దాసజనం బెట్లు దాస్యంబు సలిపిరో- తిరియువానిని మారు తిరియు నీకు |
|
| తే. |
మమత నీలీల లటు సూచి బ్రమసి రేమె-తగుదువే యిట్టిఘనతకు దంభభూప చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
22 |
| సీ. |
విక్రమాక్రమిత భూచక్రుఁ డౌ హేమాక్షు- పొం గణంచుటలు కోణంగితనము కరగతామృతకుంభ గర్వితాసురకోటిఁ- దూలఁగొట్టుటలు గయ్యాళితనము కుచపూర్ణ విషదుగ్ధకుటిల యౌ పూతన- పేరు మాయించుట పిల్లతనము కంసపురీ ద్వారగమనావరోధి యౌ- మదకరి నీడ్చుట మకురుతనము |
|
| తే. |
వడిగలతనంబులా యివి? గడన యేమి-కొద్దిపను లివి నీ కిది పెద్దతనమె? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
23 |
| సీ. |
కెరలి కంసుఁడు నిన్ను నఱకఁ గాచినవాని- బారి సోదరిఁ ద్రోచి పాఱినావు సరిపోర నరకు నొంచఁగ లేక చేతివి- ల్లాలిచే నిడి దండ నలరినావు తెగడి బంధువు లాజిఁ దిట్టి కొట్టఁగ నోర్చి- వైదర్భిఁ జేపట్టి వచ్చినావు దర్పకోద్ధతి కెంతొ తత్తరపడి నిజ- స్త్రీ పదాబ్జములఁ జే మోపినావు |
|
| తే. |
నీ పరాక్రమ మిట్టిది నిఖిలజగము-లాజ్ఞ మీఱక నిల్చుట యద్భుతంబు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
24 |
| సీ. |
వ్రేపల్లెలో గొల్లవెలఁదులు గొట్ట రా- దొడిదొడి యిల్లిల్లుఁ దూఱలేదొ రాసకేళికయందు రమణులా యెందఱో- చుట్టి పట్టినఁ బాఱఁ జూడలేదొ పదియాఱు వేల గోపకుమారికలు తేరి- పాఱఁ జూచిన మతి బ్రమయలేదొ ప్రణయవాదంబున భార్య లా యెనమండ్రు- గసరివేసినఁ గూర్మిఁ గొసరలేదొ |
|
| తే. |
తలిరుబోఁ డుల యెదుటఁ దత్తరము గలుగ-నేవు పరరాజముఖమున నిలువ గలవె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
25 |
| సీ. |
ఆలు నిర్వాహకురాలు భూదేవి యై- యఖిలభారకుఁ డనునాఖ్యఁ దెచ్చె నిష్టసంపన్నురా లిందిర భార్యయై- కామితార్థదుఁ డన్న ఘనతఁ దెచ్చెఁ గమలగర్భుఁడు సృష్టికర్త తనూజుఁడై- బహుకుటుంబకుఁడన్న బలిమి దెచ్చెఁ గలుషవిధ్వంసిని గంగ కుమారి యై- బతితపావనుఁ డన్న ప్రతిభఁ దెచ్చె |
|
| తే. |
నాండ్రు బిడ్డలు దెచ్చుప్రఖ్యాతి గాని-మొదటినుండియు నీవు దామోదరుఁడవె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
26 |
| సీ. |
కడలి రాయనిముద్దుకన్నియఁ బెండ్లాడి- యూఁచఁగా నిల్లట ముండు టేమి సహజ నొక్కర్తెను షండ పాండవునకుఁ- బెండ్లిఁ జేసితి నీవు పెద్ద వేమి చిరరతిప్రౌఢను జిన్నబిడ్డని కీవు- గూర్చితి వారీతి గూడు నేమి యుగములనాటి పెన్మగువను ముసలన్న- కొగిఁ జేసితివి తగుం దగు మఱేమి |
|
| తే. |
తెలియ నవ్యక్తుఁడవు గావు తెలిసికొన్న-నిట్టివాఁ డని తెలియలే దెవ్వరికిని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
27 |
| సీ. |
నీ జ్యేష్ఠపుత్త్రుఁ డెన్నికకు రాని యశాశ్వ- తపుఁ బను ల్సేయు సంతతము జగతి వేరొక ముద్దుకుమారుఁడందఱిమోహ- లతల స్త్రీపురుషుల లంకెఁ బెట్టు నీతలోదరి లోకమాత పక్షాపక్ష- దృష్టిఁ జంచలవృత్తిఁ దిరుగుచుండు నీ వనన్యకృతాది నిబిడమాయావిధా- నుల జేయు దెవ్వరిఁ దొలఁగనీక |
|
| తే. |
నొకరికంటె గుణాధికు లొకరు మీరు-ఇంతచక్కన దెలిసె మీయింటివరుస చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
28 |
| సీ. |
సకలంబు నీవ యై మొకమఱ్ఱియాకుపై- నిచ్చఁ బరుండునాఁ డెంత గలవొ! తన బిడ్డఁ డని యశోదాదేవి పొత్తుల- నిడుక ముద్దాడునాఁ డెంత గలవొ! తక్కులమారత్త దక్కించుకొనఁగ ని- న్నెత్తుక పెంచునాఁ డెంత గలవొ! భయలేశ మెఱుఁగక బల్పాముపడగపై- గంతులు వైచునాఁ డెంత గలవొ! |
|
| తే. |
పరువు గలవాఁడ వేమి ప్రాఁబల్కు లంచు-దెలియ వరిముక్కు ముల్లంత తలవొ! లేవొ! చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
29 |
| సీ. |
కల్లరు ల్గాని వ్రేపల్లెవా రందఱు- హర్షింప నచట నీయాట సాగె మధురాపురీవరమనుజు లామోదించి- మన్నింప నచట నీయాట సాగె ద్వారకాపట్టణధన్యులు నినుఁ గోరి- కొల్వఁగా నచట నీకొల్వు సాగెఁ గరిపురధర్మజుం డురురాజసభ నిన్ను- భూషింప నచట నీముర్వు సాగె |
|
| తే. |
నెరుక మాలినవారుఁ నీపరువు దలఁతు-రేమి నీపొంకములు సాగు నేమి యచట? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
30 |