| శతకములు | మారుతి శతకము |
|
| మ. |
సురనాథుండు శతారధార నలుకన్ క్షోణీధ్రముం బోలె సం గరభూమీస్థలి ధూమ్రలోచన మహాక్రవ్యాదునిం బట్టి ని ష్ఠురశైలప్రహతిన్ విభిన్నపృథుశీర్షుం జేసి, దుర్దాంత భీ కరభంగిన్ బడఁగూల్పవే నృపతి వేడ్కం జూడఁగా మారుతీ! |
81 |
| మ. |
ఘనబాహాబలుఁ డయ్యకంపనుఁడు దైత్యానీక సంయుక్తుఁడై యనికిం డాసిన భూరిరౌద్రరసదీప్తాస్యుండవై ఘోరవృ క్షనిపాతంబున వాని పెన్నురము వ్రక్కల్ చేసి వాతూల మొ య్యన వృక్షంబును బోలె గూల్పవె సురల్ హర్షింపఁగా మారుతీ! |
82 |
| మ. |
వదనంబు బ్రళయార్కబింబము క్రియన్ భాసిల్ల, లాంగూల మా త్రిదశేంద్రాయుధవైఖరిన్ మిగుల నుద్దీపింప బంచాననో ద్యదహీంద్రంబును బోని దక్షిణకరం బాసక్తితో నెత్తి, వా రిదనాదంబున ధాత్రి గ్రక్కదలఁ బేరెంబెత్తుచున్ వచ్చి త ద్ద దశాస్యుండు సగంబుఁ జావ నఱచేతన్ వ్రేయవే మారుతీ! |
83 |
| మ. |
రణరంగమ్మున మూర్ఛనొందిన సుమిత్రాపుత్రునుం, ధీరునిన్ ఫణినాధాంశజు, లంకకట్లు గొనిపోవం జూచు దుష్టాత్ము రా వణునిం వజ్రనికాశముష్టిహతి నొవ్వంజేసి తూలించి, ల క్ష్మణునిం దేర్చి యొసంగవే విభునకున్ సంతోషివై మారుతీ! |
84 |
| మ. |
హరిజిచ్చాపవిముక్త ఘోరతరబ్రహ్మాస్త్ర ప్రభావంబునన్ వరుసన్ మూర్ఛిలి చాపకట్టుగ రహిన్ సంగ్రామరంగమ్మునం దరుదారం బడియున్న వానరుల నుద్యచ్ఛక్తి సంజీవిచే కర మర్థిం బ్రతికించి మెప్పు గొనవే కాకుత్స్థుచే మారుతీ! |
85 |
| శా. |
దైత్యానీకపయోధి మధ్యమున మందానాద్రిభంగి రయౌ ద్ధత్యం బొప్పఁగ సంచరింపుచు బలౌదార్యం బెలర్పన్ బృహ ద్వాత్యాచక్రము శుష్కపర్ణముల చందానన్ వడిం ద్రిప్పి, యా దిత్యుల్ మెచ్చఁగ బట్టి గీటడఁచవే దేవాంతకున్ మారుతీ! |
86 |
| శా. |
జంభారాతి నిజోరుపాణిగత భాస్వద్ఘోరదంభోళిచే గాంభీర్యంబున విశ్వరూపుశిరముల్ ఖండించి నట్లీవు స ర్వాంభోధుల్ గలగంగ నార్చుచు ఫణీంద్రాభాసి నంకించి, సం రంభం బొప్ప వెసన్ త్రిశీర్షుశిరముల్ ఖండింపవే మారుతీ! |
87 |
| శా. |
మాయాసీతను జంపి నిన్ను భ్రమియింపం జేసి దుర్వారదై తేయ ప్రావృతుఁడై నికుంభిలకు నెంతేఁ గోర్కితో నేగి, య చ్చో యాగం బొనరింపుచున్న యసురేశున్ మేఘనాధాఖ్యు దీ క్షాయుక్తిన్ సమరోర్వి లక్ష్మణునిచేఁ జంపింపవే మారుతీ! |
88 |
| శా. |
విద్యుద్వల్లిక భంగి వాలము వియద్వీథిం బ్రకాశింప ను ష్ణద్యుత్యున్నతమండలంబు కరణిన్ వక్త్రంబు శోభిల్లగా ప్రోద్యద్బాహుబలం బెలర్పఁగ నికుంభుం గుంభకర్ణాత్మజున్ సద్యోమృత్యువు నొందఁజేయవె మహాజన్యంబునన్ మారుతీ! |
89 |
| మ. |
ఘనశాండిల్య మునీంద్రుశాపంబున నుగ్రగ్రాహియై ధాన్యమా లిని కాసారములోన నుండి జలముల్ నీ వర్ధిఁ గ్రోలన్ వడిన్ నిను మ్రింగం జనుదేరఁగాఁ గడిమి వానిన్ వ్రేల్మిడిం జంపి గ్ర క్కున దచ్ఛాపము దీర్చి పుచ్చవొకొ శక్రుం గొల్వగా మారుతీ! |
90 |