| శతకములు | మారుతి శతకము |
|
| మ. |
అసురాధీశ్వరుఁడవ్విధంబు విని కట్టల్కన్ రణార్థం బశీ తిసహస్రంబులఁ గింకరాఖ్యుల మహాతేజః ప్రభావాఢ్యులన్ వెసఁబంపన్ విలయాంబుదంబు కరణిన్ మిన్నంది గర్జించి దీ మస మొప్పం దగ వారినెల్లఁ గడిమిన్ మర్దింపవే మారుతీ! |
51 |
| శా. |
వప్రంబుల్ బడఁగూల్చి బల్విడి నభోభాగంబుతో రాయు చై త్యప్రాసాదముఁ గూలఁదన్ని విపులస్తంభంబుచే బాహుస త్త్వప్రావీణ్య మెలర్పఁ దద్వనముఁ దత్ప్రాసాదముం గాచు దే వప్రద్వేషుల నెల్ల దారుణగతిన్ భంజింపవే మారుతీ! |
52 |
| శా. |
శైలోత్పాటన దక్షిణుండగు నభస్వత్పుత్రుఁడన్ జన్యవి ద్యాలోలుండగు రామభద్రునకు నే దాసుండ సుగ్రీవునిన్ వాలాయంబు భజించువాఁడ హనుమన్నామంబునం బొల్తు భూ పాలుండంపఁగ భూమిపుత్రిఁ బరికింపన్ వచ్చితిన్ గ్రవ్యభు క్కాలుండన్ జనుతెండు పోరి కని లంకం జాటవే మారుతీ! |
53 |
| మ. |
కడఁకన్ రావణప్రేరితుం డగుచు వీఁకన్ జంబుమాల్యాఖ్య దై త్యుఁడు సేనాయుతుఁడై రణంబునకుఁ దోడ్తో డాసినన్ వానిఁ బ ల్విడి భాస్వత్పరిఘాయుధంబున బలోపేతంబుగా నాజిలో గడిమిం జంపి యుగాంతమేఘముక్రియన్ గర్జింపవే మారుతీ! |
54 |
| మ. |
వరుసన్ దారుణ సప్తమంత్రితనయుల్ బాహాబలంబొప్ప బం దుర వైశ్వానర సప్తహేతులన దోడ్తో వెల్గుచున్ డాసినన్ కరులం గన్న మృగేంద్రులీల పెనుకిన్కం బొంగి యద్దైత్యుల స్థిరసత్వంబున ద్రుంపవే కలన నిశ్శేషంబుగా మారుతీ! |
55 |
| మ. |
దురితాత్ముల్ దశకంఠుపంపున మదాంధుల్ పంచసేనాగ్రగుల్ పరుషోగ్రాస్త్రము వేయుచుం గదియఁ గాలం గేల మర్దించి భీ కరభంగిన్ పరిమార్చి తోరణ విటంకస్థుండవై, వెండి దు ష్కరదైతేయ సమాగమంబు మదిలోఁ గాంక్షింపవే మారుతీ! |
56 |
| శా. |
అక్షీణస్ఫుట బాహుశౌర్యుఁడు మహాహంకారుఁడున్ దైత్యహ ర్యక్షుం డక్షుఁడు డాయఁ దార్క్ష్యుఁడహినట్ల వాని పదంబులన్ దక్షత్వంబునఁ బట్టి యెత్తి వడి మింటన్ బల్మరుం ద్రిప్పి జ న్యక్షోణిం బడవైచి చంపవె బలౌద్ధత్యంబునన్ మారుతీ! |
57 |
| మ. |
జనితామర్షణుఁ డింద్రజిత్తు సకలాస్త్రజ్ఞుండు బ్రహ్మాస్త్రబ ద్ధునిఁ గావింప వరప్రభావమునఁ దోడ్తొ బంధముక్తుండవై దనుజేంద్రుం గని వానితో విభుని దోర్దర్పంబు సర్వంబు దె ల్పనగుం గాకని బద్ధుఁడైన పగిదిన్ వర్తింపవే మారుతీ! |
58 |
| మ. |
దితిజాధీశుని మ్రోల నిల్చి వెస దత్తేజంబు రూపంబు సం స్థితి సర్వంబును బోలఁ జూచి యహహా తేజస్వి యౌ వీని యం దతి దౌష్ట్యంబిది లేక యున్న సురలోకాధీశ్వరత్వంబున స మ్మతి నొందం దగ నర్హుఁడంచు మదిలో భావింపవే మారుతీ! |
59 |
| మ. |
భవదీయాకృతియున్ బ్రతాపమును శుంభద్వీర్యముం గాంచి దై త్యవిభుండీతఁడు కీశమాత్రకుఁడుగాఁ డాదిత్యులుం బంపఁగా భువిఁ గీశాకృతిఁ దాల్చి వచ్చిన మహాభూతంబగుం గానిచో దివిజారాతులఁ జంపునే యనుచుఁ జింతింపండొకో మారుతీ! |
60 |