| శతకములు | వృషాధిప శతకము |
|
| ఉ. |
భీమగజంబు డీకొనిన బిట్టరఁజంపుడు బిజ్జలేంద్రుఁడు ద్దామతఁ దక్కి మ్రొక్కుటయుఁ దత్కరినెత్తిన విక్రమోద్ధతుం డా మడివాలు మాచయకు నగ్గలమైన మహానుభావ! నా స్వామివి నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
81 |
| ఉ. |
శంకదలిర్చ నెంతయు వెసన్ బరదైవ పతంగ కోట్లకున్ బింకముతోడ ఫాలతట భీమవిలోచన వహ్ని నేర్చు నా శంకరదాసి దేవునకు సద్భటుఁడంచు నుతించు నన్ను నీ వంకను ద్రిప్పుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
82 |
| ఉ. |
ఏఁడులు నూఱటంచు శ్రుతులెన్నఁగ శ్రీగిరిమీఁద నాఱునూ ఱేఁడులు సంచరించు సకలేశ్వర దేవర మాదిరాజు నా నేఁడులు నూఱుమన్న భువి నిష్ఠురకాలమహోగ్రదృష్టి క్రొ వ్వాఁడులణంపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
83 |
| ఉ. |
సూత్రము దప్పి గొఱ్ఱె గుడిఁ జొచ్చిన మిండనిఁ జంపి సాక్షిగా నో త్రిపురాంతకా! యనుచు నో యని పిల్చిన యల్ల సద్యశః పాత్రుఁడు కిన్నరయ్యకును బ్రాణసఖుండగు నిన్నుఁ గొల్తు దే వా త్రిజగత్పవిత్ర! బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
84 |
| ఉ. |
ఒక్కఁడె రుద్రుఁడన్న శ్రుతులొల్లక ప్రేలు పురాణభట్టులన్ వ్రక్కలుసేసి తత్తనువు వారిలు బ్రువ్వులుగాఁగఁ జూచు నా కక్కయగారి బిడ్డఁడనగా నుతికెక్కిన నిన్నుఁ బూన్తు మ ద్వాక్కలికాసమూహి బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
85 |
| ఉ. |
డంభమయాన్య దర్శన విడంబనుఁ డష్టమదాపహారి యా శుంభ దుదాత్తకీర్తి యగు చోడలదేవర బాచిరాజు వి స్రంభసఖుండ వీవని ప్రశంస యొనర్తు జగత్ప్రపూత వి శ్వంభర శంభుమూర్తి! బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
86 |
| ఉ. |
దీవ్రము నీ మహామహిమ దివ్యము నీ మహనీయ విక్రమం బప్రతిమంబు నీ చరిత మాద్యము నీ నిజరూపమంచు న ల్ల ప్రభుఁడర్జితోడ నుపలాలన సేయఁగ నొప్పుచున్న దే వా ప్రణుతింతు నిన్ను బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
87 |
| ఉ. |
మేదురభక్తి నీశ్వరుఁడు మెచ్చగ జిహ్వయె పళ్ళెరంబు గా నాదటఁబ్రాచి యంబలి సమర్పణ చేసి పొగడ్తకెక్కు నా మాదర చెన్నలింగము కుమారుఁడ! నిన్ను భజింతు సంతతా స్వాదిత సుప్రసాద! బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
88 |
| ఉ. |
బల్లిదుఁడై గణాధిపుల పాదజలంబులు కట్టెమోపుపైఁ జల్లికడాని గావుడును జంగమకోటికిఁ బంచి యిచ్చుచున్ మొల్లపు భక్తిఁ బేర్కొనిన మోళిగ మారయ కూర్మిబంట! మ ద్వల్లభ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
89 |
| ఉ. |
భీకర రుద్రనేత్ర శిఖిఁ బెద్దఁగఁ జేయఁగ వీరభద్రు ను ద్రేక గజంబునా నితర దేవతలన్ బడఁదాఁకు నుద్ధతుం డా కలికేత బ్రహ్మయకు నర్మిలి భృత్యుఁడ! నిన్నుగొల్తు దే వా కరుణింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
90 |