| శతకములు | వృషాధిప శతకము |
|
| ఉ. |
ఆద్య! సమర్పితాఖిల పురాతనభక్తగణానువేద్య! సం పాద్య! గుణానవద్య! యనుభావశివాంకిత గద్యపద్య! ని ర్భేద్య! గణైకవేద్య యురరీకృతవాద్య! భవాదిరోగ స ద్వైద్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
21 |
| ఉ. |
నాద కళావినోద! యభినందిత వేదహృతాపవాద! సం పాదితభక్తిమోద! బుధవందితపాద! చిరప్రమోదనా స్వాదిత సుప్రసాద! యవిషాదశిలాద సుతావిభేద! దే వా దయఁ జూడుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
22 |
| ఉ. |
కాయ గుణావిధేయ! జితకాయ! వినమ్ర జగన్నికాయ! యా మ్నాయవచోప్రమేయ! యసమాన సమంచితగేయ! భక్తి ధౌ రేయ! సదానపాయ! సుచరిత్రసహాయ! జితాంతకాయ! దే వా యొడయండ వీవ బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
23 |
| ఉ. |
స్వీకృత భక్తలోక! యవశీకృత కర్కశవావదూక! యూ రీకృత సద్వివేక! యురరీకృత జంగమభక్తి శూక! దూ రీకృత దుష్టపాక! యధరీకృత వేద విరుద్ధబౌద్ధ చా ర్వాక! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
24 |
| ఉ. |
నిత్య యుదాత్తసత్య! యతినిశ్చల జంగమ భృత్య! సజ్జన స్తుత్య! కృపాకటాక్ష పరిశోభితచైత్య! మహిష్ఠ భక్తి సం గత్యభిరామ సత్య! గురుకార్య పరాయణకృత్య! వర్జిత వ్రాత్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
25 |
| ఉ. |
ధన్య మహావదాన్య! గతదైన్య! విధూత జఘన్య! భక్తిచై తన్య! గుణైక్యమాన్య! హతదర్పక సైన్య! నిరస్త మాతృకా స్తన్య! జితారిఘోరభవజన్య! శరణ్యము చిత్సుఖాత్మ భా వన్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
26 |
| ఉ. |
చర్వితశృంగిగర్వ! గుణసంపద ఖర్వ! యపూర్వగీతగాం ధర్వ! దిగంతపూర్ణ సముదాత్త యశః కృతకర్ణపర్వ! యం తర్వినివిష్టశర్వ! విదితస్ఫురణాంచిత దర్వ! కావుమో పర్వఘనప్రసాద బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
27 |
| ఉ. |
ఖ్యాత దయాభిజాత! విపదంబుధిపోత! యజాతతత్త్వ ని ర్ణేత! వినేత భక్తిపరిణేత! మనోరథదాత! జంగమ స్తోత! ముముక్షుగీత పరిశోభిత నీతిసమేత! సద్గుణ వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
28 |
| ఉ. |
మారమదాపహార! సుకుమార శరీర! గణప్రసాద వి స్తార! వృషావతార సముదార విహార! సమద్దయాపరి ష్కార! శుభప్రకార! యవికార! మహా జగదేకవీర! దు ర్వార శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
29 |
| ఉ. |
దేశిక జన్మదేశ! యవిదేశ యనావృతపాశ! సంహృత క్లేశ! మహాప్రకాశ! కృత కిల్బిషనాశ! దయానివేశ! నం దీశనికాశ! జంగమ సమీహితకారి గుణావకాశ! దే వా శరణీయవయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
30 |