| శతకములు | కృష్ణ శతకము |
|
| క. |
దుర్భర బాణము రాఁగా గర్భములోనుండి యభవ కావు మటన్న\న్ నిర్భరకృప రక్షించితి వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా. |
31 |
| క. |
గిరులందు మేరువౌదువు సురలందున నింద్రుఁడౌదు చుక్కలలోన\న్ బరమాత్మ చంద్రుఁడౌదువు నరులందున నృపతివౌదు నయముగఁ గృష్ణా. |
32 |
| క. |
చుక్కల నెన్నఁగ వచ్చును గ్రక్కున భూరేణువులను గణుతింప నగు\న్ జొక్కపు నీ గుణజాలము నక్కజ మగు లెక్కపెట్ట నజునకుఁ గృష్ణా. |
33 |
| క. |
కుక్షిని నఖిలజగంబుల నిక్షేపముఁజేసి ప్రళయ నీరధి నడుమ\న్ రక్షక వటపత్రముపై దక్షతఁ బవళించునట్టి ధన్యుఁడ కృష్ణా. |
34 |
| క. |
విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింపఁ దలఁచి విష్ణుఁడ వనగా విశ్వము జెఱుపను హరుఁడవు విశ్వాత్మక నీవె యగుచు వెలయుదు కృష్ణా. |
35 |
| క. |
అగణితవైభవ కేశవ నగధర వనమాలి యాది నారాయణ యో భగవంతుఁడ శ్రీమంతుఁడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా. |
36 |
| క. |
మగమీనమవై జలనిధిని బగతుని సోమకునిఁ జంపి పద్మభవునకు\న్ నిగమముల దెచ్చి యిచ్చితి సుగుణాకర మమ్ముఁ గరుణ జూడుము కృష్ణా. |
37 |
| క. |
అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధిఁ దఱువఁ బొలుపున నీ వా నందంబుగఁ గూర్మమవై మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా. |
38 |
| క. |
ఆదివరాహమ వయి నీ వా దనుజు హిరణ్యనేత్రు హతుఁజేసి తగ\న్ మోదమున సురలు పొగడఁగ మేదిని వడి గొడుగునెత్తి మెఱసితి గృష్ణా. |
39 |
| క. |
కెరలి యఱచేతఁ గంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరుని\న్ ఉరమును జీరి వధించితి నరహరి రూపావతార నగధర కృష్ణా. |
40 |