| శతకములు | దేవకీనందన శతకము |
|
| మ. |
ఉర్విం బాఱుమహానదీజలము లాయూరూరునందెల్లఁ గూ డురుఘోషంబున వంకలై కలియఁగా యోగ్యంబు లైనట్లు మీ స్మరణ\న్ నానుడువు\న్ సదాశుభములై సంపూజ్యము\న్ గా భవ చ్చరణంబుల్ మది నిల్పి కొల్చెదను కృష్ణా దేవకీనందనా. |
81 |
| శా. |
బాలక్రీడలఁ గొన్నినాళ్లు పిదప\న్ భామాకుచాలింగనా లోలాభ్యున్నతిఁ గొన్నినాళ్లు మఱియిల్లు\న్ ముంగిలింగొన్ని నా ళ్లీలీల\న్ విహరించితి\న్ సుఖఫలం బెందేనియు\న్ లేదుగా చాల\న్ నీపదభక్తిఁ జేసెదను కృష్ణా దేవకీనందనా. |
82 |
| మ. |
మతిలో మిమ్ముఁదలంచు పుణ్యుఁడిలఁ దామాయ\న్ స్వదారాదుల న్వెతలం బొర్లఁడు భాగ్యవంతుఁడగుఠీవి\న్ దివ్యమృష్టాన్న సం గతిలోనాడి మనుండు భిక్షమునొసంగ\న్ నేర్చునే శూలభృ చ్చతురాస్య ప్రముఖామర ప్రణుత కృష్ణా దేవకీనందనా. |
83 |
| శా. |
అన్నంబైనను దక్రమైనఁ దగుతోయంబైన నభ్యాగతుల్ దన్నాశించిన నేమియు న్నిడక యేధర్మంబునుం జేయ కే మన్న న్నూరకయుండు జీవశరమర్త్యశ్రేణి జేయ కే చన్న న్నేమగు నేమగు\న్ గలుగఁ గృష్ణా దేవకీనందనా. |
84 |
| శా. |
ప్రారబ్ధానుభవంబు దీఱ కపవర్గప్రాప్తి లేదండ్రుగా దీరశ్రేష్ఠు లనంతకోటులిఁక నైతే వారికర్మంబులు\న్ ప్రారబ్ధంబులు గావె ముందఱకు నోభావజ్ఞ సైరించి నా ప్రారబ్ధంబులఁ దీర్పవే కరుణఁ గృష్ణా దేవకీనందనా. |
85 |
| శా. |
శ్రీజన్మప్రభుతావిశేషుఁ డగు రాజేంద్రుండు ధీపాలనా జ్ఞాజాగ్రత్వనిదానకీర్తియుత రక్షాలక్షణాధీశుఁడై రాజిల్లుం బహుకష్టుఁడైన ధరసామ్రాజ్యంబు బాలింపుచో నైజంబై తగునా విశేషములు కృష్ణా దేవకీనందనా. |
86 |
| మ. |
సమరద్వేషుల సంగరాంగణమున\న్ సాధించి సామ్రాజ్య సౌ ఖ్యముఁ దాఁగాంచి సహించి చొప్పడు వివేకప్రాజ్ఞతల్గాంచు భూ రమణశ్రేష్ఠుఁడు తావకానుచరుఁడై రాణించు శిక్షించు దు ష్టమతి భ్రష్టమదాంధ శత్రువుల కృష్ణా దేవకీనందనా. |
87 |
| మ. |
విగతక్లేశులు వీతకిల్బిషమయుల్ విజ్ఞానవిద్యానిధుల్ నిగమార్థజ్ఞులు నిశ్చలవ్రతయుతుల్ నిర్వ్యాజనిష్ఠాయుతుల్ సుగుణుల్ సూనృతవర్తనుల్ శుభకరుల్ శుద్ధాంతరంగుల్ శుభుల్ జగతీమండలి నీదుసేవకులు కృష్ణా దేవకీనందనా. |
88 |
| శా. |
దీనుల్గల్గిన నీదు రక్షణగుణాధిక్యంబు రాణించు నౌ దీనుండెవ్వఁడు లేఁడు నీదుకరుణాదృష్టి\న్ గృతార్థుల్ జుమీ నేనే దీనుఁడ నన్నుఁ బ్రోవు శరణంటిం ద్వన్ముఖోదీర్ణ సు జ్ఞాన శ్రీకరమూర్తి నమ్మితిని కృష్ణా దేవకీనందనా. |
89 |
| శా. |
పాత్రాపాత్రవివేకము ల్సమసె పాపం బెచ్చె ధర్మంబును\న్ మిత్రఘ్నత్వము కల్లలాడుటయు స్వామిద్రోహముం గొండెము\న్ ధాత్రిం బూజ్యము లయ్యె సజ్జనులచందం బెట్లు రక్షించెదో సత్రాజిత్తనయా మనోరమణ కృష్ణా దేవకీనందనా. |
90 |