| నాటకములు | వరవిక్రయము (1923) | కాళ్లకూరి నారాయణరావు |
| ద్వితీయాంకము. (ప్రదేశము: లింగరాజుగారి వ్యాపారపు గది.) | |||||||||||||||
| లింగ:- | (ఆయాసముతోఁ ప్రవేశించి) ఇస్! అబ్బా!
ఇఁక స్థిమితముగాఁ గూరుచుండి, యీపూఁటతోఁ గాలదోషముపట్టు కాగితము లేమయినఁ గలవేమో చూడవలెను. వాయిదా లయిన పత్రములకు వడ్డీలు పంపనివారికి వడఁకు పుట్టునట్లు నోటీసులు వ్రాయవలెను. ఈపూఁట కోర్టులో హీరింగు లేమున్నవో చూడవలెను. దేనిపట్ల రవంత యేమఱినను దెబ్బతినక తప్పదు! పనివచ్చినచో ప్రాణములనైనఁ బోనీయఁ దగును గాని పయిస సొమ్ము పోనీయఁగూడదు! ప్రాణములో నేమున్నది? గాలి యేగా! పైక మట్టిదా! ప్రపంచమంతయు దానిలో నున్నది! కనుకనే, "ధనమూల మిదం జగ" త్తన్నాఁడు.
భాగ్యము పెరుగుఁటకు బహు ప్రజ్ఞలు కావలెను.
పెక్కు మాట లేల-
వెఱ్ఱివెంకటాయలు! పత్రిక లనియుఁ, బరిశోధన లనియుఁ, సంఘ సంస్కరణము లనియు, సహాయ నిరాకరణము లనియు, స్వరాజ్యమనియు, చట్టుబండ లనియు, పనిలేని గొడవలు పయిఁ బెట్టుకొందురు. కాని, వడ్డీలు పెరుఁగుటకు వాటమైన సాధన మొక్కరును జూడరు.
వాస్తవమునకు వడ్డికి సాటియైనది మఱి యున్నదా?
(అంతలో స్మృతి నభినయించి) దండకము: | ||||||||||||||
| ఘంట:- | (ప్రవేశించి) బాబూ! పది కావచ్చింది. వంట సామానిస్తారా! | ||||||||||||||
| లింగ:- | నీవంట వల్లకాడుగాను! నీకంత తిండియేవ యేమిరా! ధనుర్మాసము దప్పళమున కెవరైన పిలుతురేమో కాసింతసేపు కనిపెట్టఁగూడదా? | ||||||||||||||
| ఘంట:- | సరే, మీ యిష్టం. రాత్తిరి పద్దులు రాసుకుంటారా? | ||||||||||||||
| లింగ:- | అదిగో ఆ మాటన్నావు సరి! (అని డసుకు పెట్టె దగ్గఱఁ గూరుచుండి, పద్దులపుస్తకము పైకిఁ దీసి) ఏదీ చెప్పు, బియ్యమెన్ని? | ||||||||||||||
| ఘంట:- | మణిమెడు తక్కువ మానెడు. | ||||||||||||||
| లింగ:- | (వ్రాయుచు) వంటకట్టెలు? | ||||||||||||||
| ఘంట:- | మూడు. | ||||||||||||||
| లింగ:- | పిడకలు? | ||||||||||||||
| ఘంట:- | రెండు. | ||||||||||||||
| లింగ:- | నిప్పుపుల్ల? | ||||||||||||||
| ఘంట:- | నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిలవ బాపతు సగం. | ||||||||||||||
| లింగ:- | ఉప్పు? | ||||||||||||||
| ఘంట:- | వుద్ధరిణెడు. | ||||||||||||||
| లింగ:- | చింతపండు? | ||||||||||||||
| ఘంట:- | నిన్న మధ్యాహ్నం పులుసుకోసం పిసగ్గా నిలవవున్న తుక్కు. | ||||||||||||||
| లింగ:- | ఉట్లేమి చేసినావు? | ||||||||||||||
| ఘంట:- | వుంచా నీపూటకు. | ||||||||||||||
| లింగ:- | మిరపకాయలు? | ||||||||||||||
| ఘంట:- | మూడు. | ||||||||||||||
| లింగ:- | మాగాయ? | ||||||||||||||
| ఘంట:- | అమ్మగారి కో టెంకా, అబ్బాయిగారి కో ముక్కాను. | ||||||||||||||
| లింగ:- | గంజి? | ||||||||||||||
| ఘంట:- | గరిటెడు మీకూ, అరగరిటెడు అబ్బాయిగారికి పోశాను. | ||||||||||||||
| లింగ:- | మిగిలింది? | ||||||||||||||
| ఘంట:- | చద్దన్నాల్లో సరిపెట్టాను. | ||||||||||||||
| లింగ:- | నీవో? | ||||||||||||||
| ఘంట:- | బజార్లోంచి బంగాళాదుంపల కూర తెచ్చుకున్నాను. | ||||||||||||||
| లింగ:- | ఏడిచినట్లే యున్నది. కాని యెన్నడు నీలాటి విఁక నింటికి గొనిరాకు! ఆవాసన తగిలి అబ్బాయికూడా పాడు కాఁగలడు! తెలిసినదా? ఇదిగో కరివేపచెట్టుమీఁద కాకి గూడుపెట్టినది. యింతలో డొంకెనతో దానిని బడద్రోసి యీపూఁట పొయిలోనికి సిద్ధము చేసికో. కరివేపమండ రాలినచో కడుపు చీల్చెదనుసుమా! | ||||||||||||||
| ఘంట:- | రామరామా! పక్షిగూడు పడగొట్టడం పాపం కాదండీ? | ||||||||||||||
| లింగ:- | పాప మేమిటి నీ బొంద! ఖరసంవత్సరములో మాయింటి వంటంతయు కాకిగూళ్ళతోనే వెళ్ళిపోయినది. | ||||||||||||||
| ఘంట:- | ఇదేఁవిటండీ! యింత ఘోరఁ వెక్కడా చూళ్ళేదు. ఇల్లాంటి పనులుమాత్రం యింకెప్పుడూ చెప్పకండేం. (నిష్క్రమించును.) | ||||||||||||||
| లింగ:- | దరిద్రపుఁ గుంకలకు ధర్మపన్నములు మెండు! ఆవాజె వన్నెల విసనకఱ్ఱ యగుటంబట్టి వంటకుంకలను బెట్టుకొనక వల్లపడకున్నది కుఱ్ఱవానికి వివాహమై, యాకుఱ్ఱది కాఁపురమునకు వచ్చువఱకు నీకుంక కుద్వాసన చెప్పుటకు వీలులేదు. | ||||||||||||||
| బస:- | (ప్రవేశించి) నాన్నా! అమ్మకు మొన్న బండికట్టినవాఁడు అద్దె కొఱకు వచ్చి యఱచుచున్నాఁడు. | ||||||||||||||
| లింగ:- | ఇంటిలో లేరని చెప్పకపోతివా? బాబూ! పదునాఱేండ్లు పయిఁబడినవి యిప్పటికైన నీకీపాటియూహ పుట్టలే దేమిరా? | ||||||||||||||
| బస:- | ఉండఁగా లేరని చెప్పుటకూహ యెందులకు నాన్నా? అబద్ధమాడఁ గూడదని మాటీచ ర్లనేక పర్యాయములు చెప్పినారు. | ||||||||||||||
| లింగ:- | మీ టీచర్లిట్టి మెట్టవేదాంతములు కూడఁ జెప్పుచున్నారుగా? సరే, యిఁకనేమి చదువు సంగతి చక్కగానే యున్నది! | ||||||||||||||
| బస:- | ఫవుంటెను పెన్నుకుఁ బయిక మిచ్చెదవా? | ||||||||||||||
| లింగ:- | బాబూ! కానికిఁ గలము వచ్చుచుండఁగా ఫవుంటెను పెన్నెందులకు పనిలేక? అంతగా మనసైనచో అలుక పాన్పుమీఁద అన్నిటితోపాటు ఫవుంటెను పెన్నుగూడ నత్తవారినడిగి పుచ్చుకొనవచ్చును. గాని బండివాని కెదో చెప్పి పంపివేయుము. | ||||||||||||||
| బస:- | అదిమాత్రము నావల్లఁగాదు! (అని నిష్క్రమించును.) | ||||||||||||||
| లింగ:- | ఆ వన్నెల విసనకఱ్ఱ సంగతి యీ విధముగా నున్నది, యీ పాడుకట్టెసంగతి యీవిధముగా నున్నది! పాడు టీచర్లు కుఱ్ఱవాండ్రను పాడుచేయుచున్నారు! పయిగా కలముల క్రిందను, కాగితముల క్రిందను కర్చుపడుచున్న డబ్బునకు లెక్కయే లేదు! కనుకనే గాంధిమహాత్ముఁడు చదువులకు స్వస్తి చెప్పింపుమన్నాఁడు. వివాహ మగువఱకును వీనిని మానిపించుటకు వీలులేక చూచుచున్నాను. ఇదేమి ప్రారబ్ధమో యీదినములలో కాలేజికి వెళ్ళుచున్న వానికిఁగాని కట్నముల బిగువు లేకున్నది! ఈ కసుగాయ కుంకను కట్నములకొఱకుఁ గాకఁ గతులకొఱకుఁ బెంచుచున్నానా! నా మొదటిపెండ్లికి రెండువేలు, రెండవపెండ్లికి నాలుగువేలు, మూడవపెండ్లి కెనిమిదివేలు మొత్తము పదునాలుగువేలు వచ్చినవి. ఈ కుంకకుఁ గూడ నిదేవిధముగా వచ్చునని యాశ. ఇదేమి పాపమో ఇంతవఱకు వేయి, రెండువేలు ఇచ్చెద మనువారేకాని పట్టుమని పదివే లీయఁగలవా రగపడలేదు! నియోగ మంతకంతకు నిర్భాగ్యయోగ మయిపోవుచున్నది! ఎవరుచెపుమా వచ్చుచున్నది! చవటకుంక, తలుపుతీసి చక్కఁ బోయినాఁడు కావలయును! బండివాఁడో పరదేశ బ్రాహ్మణుఁడో యైయుండును! కానిమ్ము గదితలుపు మూసి, యేమియు నెత్తుకొని పోకుండ, కంతలగుండాఁ గనిపెట్టెదను. (అని లేచును.) | ||||||||||||||
| పేర:- | (అంతలోఁ బ్రవేశించి) మహదైశ్వర్యాభివృద్ధిరస్తు! మనోవాంఛాఫల సిద్ధిరస్తు! రాజద్వారే, రాజభవనే, రాజసభే, రాజసమీపే, సర్వదా దిగ్విజయమస్తు! | ||||||||||||||
| లింగ:- | ఏమీ! పేరయ్యయే! ఏదో పనిమీఁద వచ్చినట్లున్నావే? | ||||||||||||||
| పేర:- | ప్రభువులవద్దకు పనిలేన్దీ రాగలమా? | ||||||||||||||
| లింగ:- | అట్లయినఁ గూర్చుండి అదేమో చెప్పుము. (అని కూర్చుండును.) | ||||||||||||||
| పేర:- | (కూర్చుండి తనలో) ఈ ముండాకొడుకు దగ్గిఱ ముక్కుకు సూటిగా పోగూడదు. ముందీదారి త్రొక్కుతాను. (పయికి) చెప్పుట కేముంది? పష్టుకళాసు పద్దుమీద బదులు కావలసి వచ్చాను. | ||||||||||||||
| లింగ:- | ఎవరికి? ఏపాటి? | ||||||||||||||
| పేర:- | ఎవరికో తర్వాత చెపుతాను. బదులు కావలసింది పాతిక వేలు. | ||||||||||||||
| లింగ:- | వడ్డి యేమయిన వాటముగ వేయించఁగలవా? | ||||||||||||||
| పేర:- | వడ్డీకేం? వాజిబీ ప్రకారం పుచ్చుకోండి. | ||||||||||||||
| లింగ:- | వడ్డీకి వాజిబీ యేమిటి! ఆసామిని బట్టియు, ఆస్తిని బట్టియు, అవసరమును బట్టియు నుండును. నీతోడు, రూపాయ తొమ్మిదణాల కాని చొప్పున నిన్ననే ముప్పదివే లిచ్చాను. | ||||||||||||||
| పేర:- | అయితే కుదరదు. ముప్పావలా అంటే ముద్దుపెట్టుకుని ఇచ్చేవారున్నారు. శలవు! (అని లేవఁబోవును.) | ||||||||||||||
| లింగ:- | ఆఁగు! ఆఁగు! అంత తొందర కూడదు. ఆస్తిమాట చెప్పవేమి? | ||||||||||||||
| పేర:- | ఆస్తికేం! అవల్రకం ఆస్తి. అరవై యకరాల సర్వదుంబాలా యీనాంభూమి. పదియకరాల బత్తాయినారింజతోట, ఆఱెకరాల అంటుమామిడితోట, తొమ్మిదెకరాల తుమ్మబీడు, ఇదేప్రథమ తనఖా. ఇక విడిపించుకునేది కూడా కాదు. | ||||||||||||||
| లింగ:- | సరే పావలా అర్ధణా చొప్పున పయిసలు చేయుము. | ||||||||||||||
| పేర:- | పావలార్ధణా లేదు గీవలార్ధణా లేదు. నా కమీషను దగ్గిఱ నలుపులు పెట్టకపోతే రూపాయివఱకూ రుద్దుతాను. | ||||||||||||||
| లింగ:- | నీ కమీషను మాటకేమి నీవెక్కడికిఁ బోదువు నేనెక్కడికిఁ బోదును? ముందు కాగితములు తెమ్ము, చూతము. | ||||||||||||||
| పేర:- | కాగితాల కేం! రే పీపాటికి కాకిచేత రప్పిస్తాను, (అని లేవఁబోయి, మరలఁ జతికిలబడి) అన్నట్టు అడగడం మఱచాను. అబ్బాయి కింకా వివాహం చేశారుకారు. సమయం కాకనా సంబంధాలు రాకనా? | ||||||||||||||
| లింగ:- | సంబంధములు రాకేమీ, సమాధానము చెప్పలేక చచ్చిపోవుచున్నాను. అన్నట్లు నీవు పెండ్లిండ్ల బేరగాఁడవు గదా! నీ యెఱుకలోఁ జక్కని సంబంధ మేదయిన నున్నదా? | ||||||||||||||
| పేర:- | చక్కందో గిక్కందో నాకు తెలియదు. మీకు సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలియదు. పడితేమాత్రం బంగారాని కెత్తుకెత్తయిన సంబంధం వొకటి సర్వసిద్ధంగా వుంది. | ||||||||||||||
| లింగ:- | ఎవరు వారు? | ||||||||||||||
| పేర:- | పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కిద్దరు కొమార్తె లున్నారు. పెద్దకుమార్తెకు పదమూడవ యేడు. పక్వానికివచ్చిన పండు! ముఖం ముద్దు లోడుతోంటుంది. కళ్ళుచూస్తే కడుపు నిండవలసిందే! చక్కగా చదువుకుంది. | ||||||||||||||
| లింగ:- | సరేకాని కన్యకుఁ గావలసినవి చదువు, చక్కదనము గావు.
| ||||||||||||||
| పేర:- | అలాగైతే మీరు చెప్పిన లక్షణా లన్నీ అచ్చంగా ఆపిల్లవద్దనే వున్నాయి. మూడు మెతుకులకంటె ముట్టదు. లేచింది మొదలు పరుండేవరకూ లేడిపిల్లలాగు పని చేస్తుంది. | ||||||||||||||
| లింగ:- | ఇంతకును కట్న మేపాటి యీయఁగలరు? | ||||||||||||||
| పేర:- | అదుగో అక్కడేవుంది తంటా! ఆపిల్ల లిద్దరకీ వంటను వెయ్యేసిరూపాయల బాలతొడుగు లున్నాయి. అయిదేసి వందలు వచ్చే మాతామహు డిచ్చిన మాన్యా లున్నాయి. అందువల్ల కట్నంలేకుండా చేసుకుంటామని కావలసినంత మంది కాళ్లకాడికి వచ్చి తిరిగిపోతున్నారు. | ||||||||||||||
| లింగ:- | అయితే, పేరయ్యా! ఆ పిల్ల యొంటిని అచ్చముగా బంగారపు తొడుగుండుఁగాక అరువదిపుట్ల మాన్యముండుగాక గౌరవము కోరువాఁ డెవ్వఁడైనఁ గట్నములేని సంబంధమున కిష్టపడునా! | ||||||||||||||
| పేర:- | అలాగైతే, గౌరవార్థమని మెడలు విరిచే కాస్తోకూస్తో యిచ్చేలాగు చూడాలి. ఏమాత్రం అనమంటారు? | ||||||||||||||
| లింగ:- | అసలు ఆయనకున్న అస్తియేమో చెప్పినావుకావు. | ||||||||||||||
| పేర:- | ఆయనకున్న ఆస్తి యేమిటో అందఱూ యెఱిగినదే. పది సంవత్సరాలు రివిన్యూ యినిసిపేటరు పనిచేశా రన్నమాటే కాని పయిస పుచ్చుకొని యెఱుగరు. ఈమధ్య నానుకోవాపరేషాన్ని నమ్మి ఆవుద్యోగానికిగూడా హస్తోదకాలిచ్చి హాయిగా రాట్నం ముందు పెట్టుకొని కూర్చున్నారు. అయితే, పిత్రీయం బాపతు పదియెకరాల భూముంది. పన్నులుపోగా పదియెకరాల వల్లా పదిపదులు నూరుబస్తాలు వస్తాయి. వారు కాపురంవున్న మేడ వుంది. | ||||||||||||||
| లింగ:- | అట్లయినచో, నటువంటి పెద్దమనుష్యులను మన మంత యిబ్బంది పెట్టుట న్యాయము కాదు, ఆ మేడవా రుంచుకొని ఆ పదియెకరముల పొలమును మనకు వ్రాసియిచ్చి అందము కొఱకు వేయిన్నూటపదార్లు రొక్కము, వెండిచెంబు, వెండికంచము, వెండిపావకోళ్ళు, అయిదుదినములు నైదుపట్టుతాబితాలు ఇటువంటివిమాత్ర మిమ్మనుము. నా బారీతనము బాగుగ నున్నదా? | ||||||||||||||
| పేర:- | బాగేమిటి బంగారు తునకలాగుంది! కాకపోతే, కార్యమయిన మర్నాటినుంచి వారు అన్నమో రామచంద్రాయని ఆవీధినీ, యీవీధినీ అడుక్కు తినవలసి మాత్రం వుంటుంది! బాబూ! మీబేరం కుదిరేబేరం కాదు! శలవు పుచ్చుకుంటా. (అని లేవఁబోవును.) | ||||||||||||||
| లింగ:- | (లెక్కపట్టుకొని) ఆగు ఆగఁవోయ్- అన్నిటిలో నొక్కటే తొందరా! నీ యభిప్రాయ మేమిటి? | ||||||||||||||
| పేర:- | వేయిన్నూటపదహార్ల కయితే వెంటనే కుదురుస్తాను. అంతకు పయి నైతే ఆ సంబంధం మీకు దక్కదు. | ||||||||||||||
| లింగ:- | సరికాని యీపిల్లవానిక్రింద నాకెంత సొమ్మయినదో యెఱుఁగుదువా! తృప్తిగా వారివల్ల రాఁబట్టి తృణమో కణమో నావల్లఁ దినవలెనుగాని నీసొమ్మే పోయినట్లు నిగిడెదవేమి? పురుషోత్తమరావుగారు నాకంటెఁ బూర్వపుఁ జుట్టమా యేమిటి నీకు? | ||||||||||||||
| పేర:- | ఆలాగన్నారు గనుక, అసలుసంగతి మనవిచేస్తాను వినండి. ఆయన కట్నంలేని సంబంధం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతంమీద మహాపెడితే రెండువేలకంటె పెట్టరు. అందుచేత మనం కొంచెం మాఱుత్రోవ త్రొక్కాలి. ఆయనతో కట్నం మాటేమీ కచ్చితంగా చెప్పక మంచిరోజు చూచి మాట్లాడే నిమిత్తం మనయింటికి తీసుకువస్తాను. సరిగా ఆ సమయానికి వివాహాల వీరయ్యగాడు వచ్చి, వేలంపాటలోకి దించేలాగు ఏర్పాటు చేస్తాను. ఆపాటలో పంతులుగారి కావేశం యెక్కించి మూడువేలవరకూ పాడిస్తాను. నా కేమిస్తారో న్యాయంగా శలవివ్వండి! | ||||||||||||||
| లింగ:- | ముష్టి మూడువేల కోసమిన్ని ముచ్చటలా! ఆ మూడువేలలోనే నీ ముడుపా! చాలుచాలు! అథమపక్ష మైదువేలయిన లేకున్న మన కాసంబంధ మక్కఱలేదు. | ||||||||||||||
| పేర:- | అబ్బ లింగరాజుగారూ! అసాధ్యులు గదా! సరే, చచ్చో ముతమారో అయిదువేలూ అనిపిస్తా ననుకోండి. అందులో, అయిదువందలు నావి, మిగతవి మీవి. ఇష్టమేనా? | ||||||||||||||
| లింగ:- | అదిగో అదే పనికిరాదు! అందులో అఱకాని బొఱ్ఱి కాఁగూడదు. నీయైదువందలు నీవు పయిగా రాబట్టుకొన వలసినదే. | ||||||||||||||
| పేర:- | సరే, నా తంటాలు నేనే పడతాను. వీరయ్యగాణ్ణి పంపుతాను గానీ వాడూ మీరూ ముందు కాస్త కూడబలుకుకోండి. పని జరిగాక వాడికి పదిరూపాయలు మాత్రం పారవెయ్యండి. | ||||||||||||||
| లింగ:- | దానికేమి, తరువాత నీవో నేనో లేదనిపింతము లెమ్ము. | ||||||||||||||
| పేర:- | అన్నట్లు ఆభరణాల సంగతి చెప్పారు కారు. ఆభరణాల మాట చెవిన పడితేనేగాని ఆడంగులకు వేడే పుట్టదు. | ||||||||||||||
| లింగ:- | వెఱ్ఱివాఁడా! మాపిల్లకు మేము వెలితి చేసికుందుమా? అప్పు డడావిడి పడవలసి వచ్చునని అయిదువేల రూపాయల నగలు చేయించి సిద్ధముగా నుంచినాను. | ||||||||||||||
| పేర:- | సరే యింకేమీ. నాకిప్పటికి శలవు. (అని లేచి నిష్క్రమించును.) | ||||||||||||||
| లింగ:- | అన్ని విధములచేత నీబేర మనుకూలమయినదే. పదియెకరముల భూమియుఁ బదివేలు, బాలతొడుగు వేయి, కట్నమయిదువేలు, మొత్తము పదునారువేలు! లాంఛనములనియు, గీంఛనము లనియు లాగుట కింకను లక్షమార్గము లున్నవి. ఆమీదఁ నలుకపా న్పున్నది. ఆవెనుక, నాషాఢపట్టీ యున్నది - ఆపైని గర్భాధానపు బెట్టున్నది!
| ||||||||||||||
| (తెరపడును.) ఇది ద్వితీయాంకము. | |||||||||||||||