| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| కవి స్వీయచరిత్ర | ||
| సీ. |
కౌశికగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ - సూత్రుఁ డార్వేల పవిత్రకులుఁడు నందిసిం గామాత్యునకును దిమ్మాంబకుఁ - దనయుండు సకలవిద్యావివేక చతురుఁడు మలయమారుత కవీంద్రునకు మే - నల్లుండు కృష్ణరాయక్షితీశ కరుణా సమాలబ్ధ ఘన చతురంతయా - న మహాగ్రహార సన్మానయుతుఁడు |
|
| తే. |
తిమ్మమార్యుండు శివపరాధీనమతి య ఘోరశివగురు శిష్యుండు పారిజాత హరణ మనుకావ్య మొనరించె నంధ్రభాష నాదివాకర తారా సుధాకరముగ. |
108 |