| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| ఆశ్వాసాంతము | ||
| శా. |
ఏకచ్ఛత్రిత సర్వభూతల! నృసింహేంద్రక్షమాభృత్తపః పాక ద్యోతిత రూప! మౌక్తిక తులాభార ప్రదానోన్నతా! కోకస్తన్యసమాస్త్ర సన్నిభ! హరి త్కూలంకషోద్యద్యశ శ్శ్రీకర్ణాటమహీశ! వైరి కరిరా ట్సింహ ప్రతాపోదయా! |
109 |
| క. |
భువనవిజయాఖ్య సంస న్నవరత్నవిభాప్రభాత నలినాప్త! రమా ధవ చరణకమల సేవా ప్రవణమతీ! వీరరుద్ర పర్వత వజ్రీ! |
110 |
| మంగళమహాశ్రీ. |
చిత్తజభిదంఘ్రియుగ చింతన కళాధిగత జిష్ణుసమ వైభవవిశేషా విత్తరమణామరగవీ తరణిభూ జలద విశ్రుత కరాంబురుహ! గోష్ఠీ నృత్త మణిరంగతల! నీతి మనురాజనిభ! నిర్భరదయారస పయోధీ! మత్తగజ యూథ మదమగ్నసుఖి తాళి రవమాన్యగృహ! మంగళమహాశ్రీ! |
111 |
| గద్యము. |
ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ సర్వంబునుం పంచమాశ్వాసము. |
|