| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| సత్య సవతులందఱకు వాయనము లొసఁగుట | ||
| చ. |
తనుతరమధ్య యాగమవిధానము తప్పక యుండ మౌనిచే ననుమతిఁ గాంచి మ్రొక్కి వినయంబున నందఱ నామతించి క ల్ప నగముక్రొవ్విరుల్కనకపాత్రములం దగ నించి యిచ్చె వా యనములు రుక్మిణీ ప్రభృతులౌ సవతు ల్పదియాఱు వేలకు\న్. |
90 |
| క. |
ఈచందమున నమానుష గోచర మహిమాఢ్యుఁడైన గోవిందుని స త్యాచంద్రముఖీ వరు సుర వాచంయమి పలికెఁ జతుర వాచాప్రౌఢి\న్. |
91 |