| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| సత్యభామ శ్రీకృష్ణుని మరలఁ గొనుట | ||
| చ. |
అపుడు విరించిసూనుఁడు జనార్దను నెయ్యపు వాలుఁగంటిఁ జూ చి పడఁతి! నీ మనోహరునిఁ జేకొను మిచ్చెద నంచుఁ బల్కుచో నపరిమిత ప్రమోద భరితాననయై వెస నిచ్చె వేలుపుం దపసికి నాత్మభూషణవితానము లన్నియు నిష్క్రయంబుగ\న్. |
88 |
| క. |
ఇచ్చి కయికొనియెఁ గ్రమ్మఱ నచ్చిగురుంబోఁడి విభుని నావైభవము\న్ మెచ్చి కురియించి రపుడు వి యచ్చరు లచ్చెరువుగాఁగ నలరుల వానల్. |
89 |