| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| నారదుఁడు శ్రీకృష్ణునిచే నూడిగములు సేయించు కొనుట | ||
| సీ. |
మేళవించినవి సుమ్మీ దీని మెట్లని - మాంసలాంసంబున మహతిఁ జేర్చి, మిన్నేటి జలము సుమ్మీ తొలంకెడు నని - డాచేత మణికమండలు వొసంగి, యిది జపోచితము సుమ్మీ జతనంబని - వలచేతఁ బద్మాక్షవలయ మిచ్చి, యీశానుఁ డిచ్చె జుమ్మీ మాకు నిదియని - శార్దూలచర్మంబుఁ జంకఁ జొనిపి, |
|
| తే. |
పొమ్ము పొమ్మని యొక పోవఁ బోవ, రమ్ము రమ్మని మరలఁ జేరంగఁ బిలిచి, కపట నటనా పరుం డైన కంసవైరిఁ బరమముని నవ్వుటాలకుఁ బనులు గొనియె. |
86 |
| మ. |
నిగమాంత ప్రతిపాద్యు నాద్యు నభవు న్నిత్యు న్గుణాతీరు వి శ్వగురు\న్ జిన్మయు నవ్యయుం బరము నిశ్శంకం బనుల్గొంచు మౌ నిగరిష్ఠుండు కృతార్థుఁ డయ్యె నన సందేహింపఁగా నేల! భ క్త గణాధీనుఁ డనంగ నవ్విభుఁడు లోకఖ్యాతిఁ బెంపొందఁడే? |
87 |