| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| శ్రీకృష్ణుఁడు వజ్రాయుధమును నొడిచిపట్టుట | ||
| సీ. |
తలలు వీడంగ విద్యాధరు ల్పఱచిరి - గగ్గులకాండ్రైరి ఖచరవరులు చట్టుపైఁబోఁక లై చనిరి గంధర్వులు - గరుడులు పంచబంగాళ మైరి కన్నది గతి గాఁగఁ గిన్నరు లరిగిరి - పన్నగేంద్రులు పటాపంచ లైరి పోయినపోక లై పోయిరి సిద్ధులు - దిక్కు మొగము లైరి దిగధిపతులు |
|
| తే. |
హరిహయ త్రాణ నాయత్తు లగుచు వచ్చి మునులు సంప్రార్థనా వచోముఖరు లైరి పూని తనమీఁద వచ్చు దంభోళి నిట్లు పంకజోదరుఁ డొడిసి చేపట్టుటయును. |
37 |