| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| ఇంద్రుఁడు వజ్రాయుధమును బ్రయోగించుట | ||
| ఉ. |
వీరుఁడ వౌదు, దీని బలువ్రేటున కోరిచి నిల్చి తేని యం భోరుహనాభ! యంచు సురపుంగవుఁ డప్పుడు లోకభీకరా కారత నిల్చి భీతి పరికంపితులై సుర లూహ లేది హా హారవము ల్ఘటింపఁ గులిశాయుధరాజముఁ బూఁచివైచిన\న్. |
34 |
| మహాస్రగ్ధర. |
శతధారా జాయమాన జ్వలన ముఖశిఖాచ్ఛాది తాభ్రస్థలంబై, వితతాభీలధ్వని శ్రీవిలసన బధిరోద్విగ్న దిగ్వారణంబై, కృతలోకాలోక ముఖ్యాఖిలగిరి చలన క్షిప్తభూమండలంబై, పతయాళు ద్వాదశాత్మ ప్రకరఖరకరౌపమ్యమై యేఁగుదేర\న్. |
35 |
| మ. |
కని నెమ్మోమునఁ బిన్ననవ్వు దొలఁకం గంసారి నిశ్శంకఁ దా ర్క్ష్యుని నడ్డంబుగఁ ద్రిప్పి వేగ రవితేజో దుస్సహ స్ఫూర్తిమైఁ దను డాయ న్శతకోటిఁ గేలి శతపత్రక్రీడఁ బట్టెం గటా క్ష నిరీక్షాగతి నందకత్సరుకిణాంకంబైన హస్తంబున\న్. |
36 |