| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| శ్రీకృష్ణుఁడు యుద్ధమునకు సంసిద్ధుఁడగుట | ||
| ఉ. |
ఆ కమలాయతాక్షి నమరావనిజాతము డించి సంభ్రమ న్నాకపురీ మహారథుల నవ్వుచుఁ గన్గొని యంగుళిత్ర గో ధా కలనంబుతో యదువతంసుఁడు శార్ఙ్గనిబద్ధ శేష ని ర్మోక నిచోళముం దిగిచె రోష నట ద్భ్రుకుటీ విలాసుఁడై. |
4 |
| క. |
తిగిచి, శరాసన మెక్కిం చి, గుణధ్వని చేసి, యంస శిరముల దొనల\న్ బిగియించి, తూపు లొక్కట నిగిడింపఁ దొడంగె మరు దనీకిని మీఁద\న్. |
5 |