| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| అమరసేన శ్రీకృష్ణుని చుట్టుముట్టుట | ||
| ఉ. |
వచ్చితి మింక నెందుఁ జనవచ్చు నొహో! నిలు, పారిజాత పా టచ్చర! యంచు జంకెలు గడల్కొనఁ గృష్ణునిఁ జుట్టుముట్టి వై యచ్చరసేన దాఁకునపు డచ్చల మేమని చెప్ప! దిక్కులం జిచ్చఱ తూపుఁ దండములు సింహరవంబులు నిండె నొక్కట\న్. |
3 |