| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| పారిజాతాపహరణము - పంచమాశ్వాసము | ||
| క. |
శ్రీ వర్ణనీయ! తిరుమల దేవీహృదయేశ! యమృతదీధితి కుల పా రావార పారిజాత! ధ రావలయ శరణ్య! కృష్ణరాయ వరేణ్యా! |
1 |
| తే. |
అవధరింపుము జనమేజయ క్షితీశ వరున కిట్లను నమ్మౌనివల్లభుండు దైవ సైన్యంబు లీరీతిఁ దరతరంబ వెడలి మొన లేర్పరించి యుద్వేలవృత్తి. |
2 |