| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| ఆశ్వాసాంతము | ||
| శా. |
బాణద్వి ణ్మథి తాంబుధి ధ్వని కళా పాణింధ మానీక ని స్సాణ స్వాన భిదేళి మాద్రితట! నిస్సామాన్య చాపాగమ ద్రోణాచార్య! సురీ సమూహ వరణో ద్యుక్తాహిత శ్రేణి ని శ్రేణీభూత కృపాణ! మాంసల భుజా శేషాహిపత్యుద్ధరా! |
91 |
| శా. |
వాజ్యారోహణనైపుణీనకుల! దోర్వాతంధ యారూఢ స ర్వ జ్యాచక్ర! రజస్తమశ్చయ తమిస్రా రూప జన్యాంగణ ప్రాజ్యోద్గీత యశ శ్శశాంక! దళితారాతి క్షమాపాల ర క్తా జ్యోదంచ దుదార శౌర్య హుతభు గ్వ్యాప్తాభి లాశాంతరా! |
92 |
| క. |
చండతర మూరురాయర గండ మహాబిరుద! ధాటికా రయ విచల త్కొండపలి కొండవీటీ మండల కటకేశ సింధు మందర కుధరా! |
93 |
| తోటకము. |
త్వరితాధరితానిలవాజి నట త్ఖురజోరు రజోభర గూఢ రవి స్ఫురణా! కరణాధిక శూత్కృతి మ ద్ద్విరదాకర దారణ వీరబలా! |
94 |
| గద్యము. |
ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ చతుర్థాశ్వాసము. |
|