| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| ముప్పది మూడు కోటుల దేవతలు యుద్ధమునకు వెడలుట | ||
| చ. |
హరిహయుఁ డాహరిం గెలుచు నాసయు మోసమునాక యీ గతిం బురి వెడలంగ నవ్విభునిమ్రోల మరు ద్వసు విశ్వ రుద్ర భా స్వర తుషి తాదిక త్రిదశవర్గము ముప్పదిమూఁడుకోటు లు ద్ధురగతి నేఁగుదెంచె రణధూర్వహ గర్వము లుల్లసిల్లఁగ\న్. |
87 |
| శా. |
అర్వారోహణ చాతురీ విలస నాహంకార దుర్వారత న్సర్వాంగీణములైన మైమెఱువులు న్జంచత్కృపాణంబులు\న్ గర్వాలాప విడంబము ల్మెఱయ జోకం జిత్రసేనాది గం ధర్వు ల్వజ్రికిఁ దోడుసూపిరి పురద్వార ప్రదేశంబున\న్. |
88 |
| ఉ. |
హేమధరాధరంబు చలియింప వెస\న్ బహుకోటిసంఖ్యలై యామరసైన్యము ల్నడచునప్పు డనంత సితోష్ణవారణ స్తోమ నిరోధ మందియును దోడనె దిక్కులుగప్పె నయ్యెడం జామర వాయు నున్నములు సాంద్ర హిరణ్మయ భూపరాగముల్. |
89 |
| ఉ. |
దారుణభంగి నొండొకటి దాఁకెడు నస్త్రముఖంబుల న్ఘణా త్కారము లుప్పతిల్ల బెడిదంబుగఁ బుట్టిన సందడిం బుర ద్వారము నిర్గమించె సురవల్లభు సేనలు భర్గ జూట కాం తార ముఖంబున న్వెడలు దైవత సింధు ఝరంబులో యన\న్. |
90 |