| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| దిక్పాలురు యుద్ధమునకు వెడలుట | ||
| ఉ. |
ఏడుకరంబుల న్వరుస నెత్తిన తోమర శక్తి చాప శ స్త్రీ డమరు స్రువ వ్యజన దివ్య మహత్తర సాధనంబు లా మ్రేడితకాంతితో నిజశరీర రుచిం బచరింప వచ్చె న య్యేడిక రాచ తత్తడిపయి\న్ హుతవాహుఁ డుదగ్రమూర్తియై. |
79 |
| శా. |
బాహా సంభృత కాలదండ జనిత స్ఫార స్ఫులిం గాళికి న్సాహాయ్యంబు ఘటించి కోప రస ఘూర్ణ న్నేత్ర దీప్తు ల్పయో వా హాంతర్గత వైద్యుతప్రభల లేవం జోప వాహ ద్విష ద్వాహోత్తంసము నెక్కి పోరి కడరె\న్ వైవస్వతుం డుద్ధతి\న్. |
80 |
| శా. |
భీమాకారులు కామరూపధరు లాభీలక్రియా పాదనో ద్దాము ల్పుణ్యజను ల్భజింపఁ గుముద స్తంబేరమం బగ్రతో భూమిం బల్లన గట్టి రా నసి రుచి స్ఫూర్తు ల్విజృంభింప సం గ్రామేచ్ఛం బలలాశి యేఁగె మనుజ స్కంధాంత రారూఢుఁడై. |
81 |
| చ. |
మకర కుళీర కచ్ఛప సమానములైన ముఖంబుల న్భయా నక రస ముప్పతిల్లఁ గెలన న్నిజకింకర వీరదానవ ప్రకరము కొల్వ బాహు శిఖరంబునఁ బాశము పూని వార్ధిఁనా యకుఁ డని కేఁగుదెంచెఁ గలహంస తురంగ రథారూఢుఁడై. |
82 |
| ఉ. |
అంద సుగంధము ల్నిజభటాలి పథశ్రమము\న్ హరింప ను త్తుంగ గదా పరిభ్రమ విధూతములై ఘనము ల్దిగంత మా తంగ విశాల కర్ణములఁ దార్కొని చామరలీలఁ జూప సా రంగహయంబు నెక్కి సమరంబున కేఁగె సమీరుఁ డుద్ధతి\న్. |
83 |
| క. |
నలకూబర మణికంఠులు బలముల నడిపింప నర్థపతి తురగముపై ధళధళిత చంద్రహా సో జ్జ్వలిత భుజుం డగుచు నడచె వాసవు మ్రోల\న్. |
84 |
| ఉ. |
ఆసనసీమఁ గ్రోధ జని తారుణ దీధితి ఫాలభాగనే త్రానల కీలలం బెనుప హస్తమున న్నిశిత త్రిశూలముం బూని మదించి ఱంకెలిడు పోఁటరి గిబ్బలఱేని నెక్కి యీ శానుఁడు వచ్చెఁ బారిషద సైన్యముతో రనకౌతుకంబున\న్. |
85 |
| ఉ. |
ఆయుధగర్భితంబు లగు నంజలు లెత్తి పులోమకన్యకా నాయక! యేన యేన యని నాక నివాసులు మ్రొక్కి సూరెలం బాయక కొల్చి రా దిగధిపాలురతో "నల నందసూనుఁ డా హా యిటు సేయునే!" యని మహాహమికం బలుమాఱు పల్కుచు\న్. |
86 |