| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| ఇంద్రుఁడు యుద్ధమునకు వెడలుట | ||
| ఉ. |
మానసవేగ రథ్యమును మాతలి సారథికంబు నగ్రసం దానిత నీలనీరద పతాకమునైన రథంబుపై శచీ జాని పులోమ వృత్ర బలజంభ శర ప్రవిఘాత కారణం బైన తనుత్రముం దొడిగె నాహవ దోహల మానసంబున\న్. |
76 |
| సీ. |
గతి మ్రుచ్చిలఁగ వేచుగాలిఁ ద్రావఁగఁ బాము - నిడిన కైవడిఁ గాలికడియ మమర, నల దేవమణికిఁ గ్రావలియిడ్డ ప్రహరి నా - గళమున ఘంటికావళులు మెఱయఁ, బన్నగాశికి నెదుర్పడ వెండిఱెక్కలు - ధరియించె ననఁగఁ బక్కెర సెలంగఁ, బారిజా తాహృతి ప్రభవ రోష మనంగ - గతి రోధ జనిత ఫూత్కృతులు నిగుడ, |
|
| తే. |
ఖరముఖ క్షుణ్ణ కాంచనక్షోణి రజము పర్వి సంధ్యారు ణేందుబింబంబుఁ బోల వాహకోత్తముఁ డైన రేవంతుఁ డమర వల్లభునిమ్రోల నుచ్చైశ్శ్రవంబు నిలిపె. |
77 |
| శా. |
చండ స్థూల రదద్వయద్వయ మహా స్తంభంబులం బూని యు ద్దండ స్ఫార పతాకికా సహితమై దానచ్ఛటా చిత్రవ ద్గండాభోగ విశాల కుడ్యములచేఁ గన్పట్టు నద్దేవతా శుండాలం బరుదెంచె సంగర రమా శుద్ధాంత సౌధం బన\న్. |
78 |