| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| వనపాలకు లడ్డగింపఁ బోవుట | ||
| చ. |
తగునె యదుప్రవీర! యిటు ధౌర్త్యము నీవొనరించి యీమరు న్నగము హరించి వంచనఁ జన\న్, దివిజాగ్రణి దీని నిచ్చె ద క్కుగ నిజకాంత కా కుసుమకోమల యాజ్ఞ భయంబునొందుఁ దేఁ టిగములు దీనిచెంగట నటింపను బువ్వుల తావిఁ గ్రోలఁగ\న్. |
56 |
| క. |
అట్టి సురతరువు నెఱుఁగక చుట్టపు మేలమునఁ గొంచు సురిఁగెడు మది నీ కెట్టు జనియించె; మరలం బెట్టుము; బలభేది విన్న మేలే నీకు\న్? |
57 |