| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| సత్యభామ ప్రగల్భోక్తులు | ||
| ఉ. |
నా విని సత్యభామ వదనంబున లేనగ వంకురింప, నే మే వచియింపఁ బూను హృదయేశ్వరునిం గనుసంజ్ఞ మాన్చి, చ న్గ్రేవల జాఱుకొంగు సవరించుచు, వీడినకొప్పుఁ బల్మఱుం జే వెడ దోఁపుచుం, బలికెఁ జెందొవచూపులు క్రేళ్ళుదాఁటగ\న్. |
58 |
| సీ. |
వినుఁడు! సురేశ్వరు వనపాలకులు! వార్ధిఁ - బొడమిన యీ దివ్యభూరుహమున కింద్రాణి యెవ్వతె? యింద్రుండు నెవ్వఁడు? - తోడి యిందిరను గౌస్తుభము నెవ్వఁ డధిపుఁ డై ధరియించె నతఁడె చేకొనుఁగాక - తెకతేర యిది యేమి యొకరి సొమ్మె? యిదె నాదు విభునిచే నీవదాన్య నగంబు - నొడియించుకొని యేఁగుచున్న దానఁ |
|
| తే. |
బలుకు లేటికిఁ, దా వీరపత్ని యేని మీ శచీదేవి తనదుప్రాణేశుఁ డైన మఘవు నిటఁ బంపి సత్యభామావిధేయు వలన మరలంగఁ గొనుటె పో వాసితనము. |
59 |