| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| పారిజాతాపహరణము - చతుర్థాశ్వాసము | ||
| క. |
శ్రీ వేంకటగిరి వల్లభ సేవా పరతంత్ర హృదయ! చిన్నమదేవీ జీవితనాయక! కవితా ప్రావీణ్య ఫణీశ! కృష్ణరాయమహీశా! |
1 |
| తే. |
అవధరింపుము జనమేజయ క్షితీశ వరున కిట్లను నమ్మౌనివల్లభుండు వనవిహారంబు సలుపుచు వచ్చి వచ్చి పారిజాతంబు గాంచి సంభ్రమ మెలర్ప. |
2 |