| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | తృతీయాశ్వాసము |
| ఆశ్వాసాంతము | ||
| శా. |
అర్చిష్మ త్ప్రతిమ ప్రతాప! మహనీయ త్యాగ! దైత్యాభియా త్యర్చోద్య చ్చతు రర్ణవాంత సకల జ్యాభోగ! జాగ్ర ద్యశ శ్చర్చా సాంద్ర దిగంతరాళ! మదన శ్యామాసహా యేంద్రభూ వర్చ స్స్తేన శరీర మోహిత జగ ద్వామా! కళా మానసా! |
59 |
| క. |
విదళిత కాళింగ మదా, స్పద సింధుర కుంభరత్న శర్కరి లారా దుదయగిరి కొండవీటీ, పదవీస్థల మండలీక భాస్కరబిరుదా! |
60 |
| పంచచామరము. |
మరు ద్వృథా తటస్థ శత్రుమండలీ గళాంతర క్షర న్నవాసృగాపగాభిసారికాదృతాంబుధీ! మరుత్పతి స్వరు క్షతి క్రమ త్రుట త్కుభృద్వర స్ఫుర ద్ధ్వనిప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటీ! |
61 |
| గద్యము. |
ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ దృతీయాశ్వాసము. |
|