| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | తృతీయాశ్వాసము |
| మధుప విలాపము | ||
| సీ. |
పరువంబు గాఁకఁ జొప్పడని మామిడితేనె - లాన నాసాస నఱ్ఱాడునవియుఁ, దమకించి చిగురాకు గమిచి నో రొగ రైనఁ - గడఁగి గొజ్జఁగినీటఁ గడుగునవియు, సంపంగి పొదరింటిచక్కి గోరఁటఁ గాంచి - యుసు రంచు మగిడి నోరూరునవియుఁ, గలిగొట్టు పసరు మొగ్గలఁ గోర్కి పొలివోయి - మునుపటిమొల్లల మూఁగునవియుఁ, |
|
| ఆ. |
నగుచుఁ దేఁటికదుపు లామనిఁ దలసూపెఁ జూపుదనుక నెల్లచోటఁ దోఁట యందుఁ దామ యగుచు నమ్మరునెలగోలు పౌఁజు లనఁగఁ జూడ్కిపండు వగుచు. |
51 |
| క. |
నంద ప్రియనందనుఁ డా నందన మఖిలర్తు నందనం బై నయనా నంద మొనరింప నమరీ బృందంబులు గొలువఁ జనుచుఁ బ్రియసతి కనియె\న్. |
52 |