| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | తృతీయాశ్వాసము |
| పారిజాతాపహరణము - తృతీయాశ్వాసము | ||
| క. |
శ్రీమహితగేహ! యుత్కల భూమీధవ దర్ప హరణ భుజసార! సుధా ధామ కుల జలధి కౌస్తుభ! రామా పాంచాల! కృష్ణరాయ నృపాలా! |
1 |
| తే. |
అవధరింపుము జనమేజయ క్షితీశ వరున కిట్లను నమ్మౌనివల్లభుండు గగనగంగా ప్రతీరోపకంఠభూమి నల్లనల్లన నేతెంచు నవసరమున. |
2 |
| ఉ. |
అంతకుమున్న నారదమహామునిచే మఘవుండు కంసదై త్యాంతకు రాక దా నెఱిఁగి యభ్రమువల్లభు నెక్కి సంభ్రమా క్రాంత మనస్కుఁడై యెదురుగాఁ జనుదెంచె జయంతుఁడుం దిశా కాంతులు మేనకాది గణికా నివహంబులు వెంటఁ గొల్వఁగ\న్. |
3 |