| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| ఆశ్వాసాంతము | ||
| శా. |
సమ్మర్ద క్షమ! ధీనిబంధన విధా సంక్రందనాచార్య! శూ రమ్మన్యాచల వజ్రపాత! జగతీ రక్షాంబుజాక్షా! శర ధ్యమ్మార్గస్థ దశాస్య రాజ్యసమ సహ్యప్రోద్భవా తీరభా గుమ్మత్తూరి శివంసముద్రపుర వప్రోన్మూల నాడంబరా! |
104 |
| క. |
తిరుమల దేవీవల్లభ! కరుణామయ హృదయ! రాజకంఠీరవ! యీ శ్వర నరస భూపురందర వరనందన; బాసదప్పవర గండాంకా! |
105 |
| స్రగ్విణీ. |
నాగమాం బాధిభూ నారసింహాత్మజా! భోగలీలా పరాభూత సంక్రందనా! త్యాగ విద్యా నిషద్యాయిత ప్రాభవా! సాగరాంత క్షమా సంప దేకాస్పదా! |
106 |
| గద్యము. |
ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ ద్వితీయాశ్వాసము. |
|