| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| ఇంద్రపురీ వైభవము | ||
| చ. |
కనక మహీధ రేంద్రు నలిక స్థిత పర్వతరాజ పట్ట బం ధనమును బోని కోటయు, ఘనంబగు తన్మకుటంబు కైవడిం దనరెడు వైజయంతమును, దవ్వులఁ గానఁగవచ్చెఁ జూచితే యనిమిష రాజధాని యిది హాయనమాత్ర కురంగ లోచనా! |
97 |
| ఉ. |
శ్రీలఁ జెలంగు నీ సురపురిం గమనీయ మహానుభావతం బోలఁగ లేక యోటములఁ బొంది భజింపఁగ వచ్చినట్టు లు త్తాల దుకూలకల్పిత పతాకలతోఁ గడు నొప్పు నన్య ది క్పాలపురంబులో యనఁగఁ బార్శ్వములం దివిషద్విమానముల్. |
98 |
| చ. |
మరలక జన్యభూమి నణుమాత్రభయంబును లేనివీరు, ల ధ్వరము లనేకము ల్విధియుతంబుగఁ జేసిన భూసురేంద్రు, లు ద్ధుర భవపాశ బంధములఁ ద్రుంచిన యోగి కులావతంసు, లీ సురపుర కామినీ వదన చుంబన మాత్ర కృతార్థ మానసుల్. |
99 |
| శా. |
సారంగాక్షుల చూపుచోఱగముల\న్ జన్గొండల న్మోహ దు ర్వా రావర్తముల న్మునింగి దరిఁ జేరన్రాక యుప్పొంగు సం సారాంభోనిధి సత్క్రియా తరణి నిశ్శంక న్సముత్తీర్ణుఁ డై చేరు న్సజ్జన నావికుండు మదిరాక్షీ! యీపుర ద్వీపము\న్. |
100 |
| క. |
అని నాకపుర మహత్త్వము వనితకుఁ దెలుపుచును హర్షవశ మానసుఁడై దనుజకులవైరి చని యొ య్యనఁ గాంచన మేదినీ ధరాగ్ర క్షోణి\న్. |
101 |
| చ. |
పతగవిభుండు మింటిపయి భంజలికా మురళీ సుఢాల వ ల్గితములఁదా నెదుర్పడిన ఖేచరవర్గము లోసరించి య ద్భతముగ మ్రొక్క లేనగవుతోఁ గనుఁగొంచు వదాన్య నైచికీ శిత ఖుర టంక చంద్రకిత సిద్ధసరిత్తట మార్గసీమల\న్. |
102 |
| క. |
సరస బిస విసర ముహు రా హర ణోద్ధుర హంస సంస దారవ దీర్ఘీ కరణ చణ గంధవహములు శరీరముల సేద దేర్పఁ జనుదెంచె రహి\న్. |
103 |