| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| దేవలోకమునకు శ్రీకృష్ణుని ప్రయాణ సన్నాహము | ||
| వ. |
అని యివ్విధంబునం బలుకు మాగధుల మధురవాక్యంబు లాకర్ణించుచు మేలుకాంచి, యప్పంచశరగురుం డహర్ముఖోచిత కృత్యంబులు నిర్వర్తించి, పురోహిత వృద్ధామాత్య సహితంబుగా నాస్థాన మండపంబున కరిగి, యుగ్రసేన వసుదేవ బల భద్రాది గురుజనంబులకు నమస్కరించి, సాత్యకి సారణ ప్రభృతి సోదరుల నాదరించి, ప్రద్యుమ్న సాంబానిరుద్ధాది కుమార వర్గంబు మ్రొక్కులు గైకొని, యదు వృష్ణి కురు భోజాంధక ప్రముఖు లగు బంధు సందోహంబుల సంభావించి, సింహాసనాసీనుండై తగువారి నుచి తాసనంబుల నుండ నియమించి, పేరోలగం బుండి కార్య త్వరా సముత్సాహ దోహలితాంతరంగుండై పతంగ పుంగవుం దలంచుటయును. |
71 |