| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| ప్రభాత శోభ | ||
| సీ. |
యామినీ సమయంబు నాశా తట ప్రదే - శంబుఁ బ్రసన్నభావంబు నొందెఁ బ్రియ చుంబితాంగనా బింబాధరంబులు - నుడురాజు నపరాగయుక్తిఁ దోఁచె, నఖిలవస్తువులుఁ బ్రాగచల కూట విటంక - తలములు నతిరోహితంబు లయ్యె, నుత్తుంగ పుర గోపురోపరి స్థలులు సా - రసములు నాత్తసౌరభము లయ్యెఁ, |
|
| తే. |
దరళ గోతర్ణకంబులు సుర పథాంత రంబులును విచ్యుత ప్రగ్రహంబు లయ్యె, నియమ పరతంత్ర భూదేవ చయముఁ గౌశి కవ్రజంబు సమాధి యోగమునఁ బరఁగె. |
68 |
| మ. |
కమలాప్తోన్నమ దంశు జాలములు దిద్భాగంబులం గ్రమ్మినం గుముదాంతఃస్థిత లక్ష్మి యెండవడ సోఁకుల్ సైఁపఁగా లేక ప త్రముల న్మాటుగఁ జేసి కప్పుకొనియెం దత్కాల సంకోచన క్రమ దంభంబున, రాజవల్లభ లసూర్యంపశ్య లౌదు ర్గదా! |
69 |
| చ. |
కొలకొల మంచు మేఁతలకు గూఁడులు వెల్వడు పక్షి రావముల్ కల మృదు వాక్య వైఖరులుగా నల వేకువ పూవుఁబోఁడి వే డ్కలు దళుకొత్త దోహద మిడం దొలిగుబ్బలిఁ గొండగోఁగుపూ గొల యలరించెనాఁ బొడిచెఁ గోకనదాప్తుఁడు పాటల ద్యుతి\న్. |
70 |