| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| చకోరముల బువ్వఁపుబంతి | ||
| సీ. |
విరహుల మై సోఁకి వేడి యౌ వెన్నెలఁ - బచ్చివెన్నెల నులివెచ్చఁ జేసి, కలువ పుప్పొళ్ళచేఁ గసటైన వెన్నెల - వలిప వెన్నెలలోన వడిచి తేర్చి, చంద్రకాంతపు నీట జాలైన వెన్నెల - ముదురు వెన్నెల జుఱ్ఱఁ బదను చేసి, సతుల మైపూఁత బిసాళించు వెన్నెలఁ - దనుపు వెన్నెల రసాయనము గూర్చి, |
|
| తే. |
చిగురు విలుకాని జాతర సేయఁ బూని కొలముసాముల నందఱఁ గూడఁబెట్టి వంతుగలయంగ బువ్వంపుబంతి విందు పెట్టి రెలమిఁ జకోరపుఁ బేరఁటాండ్రు. |
49 |