| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| వలరాజు దండయాత్ర | ||
| సీ. |
కామినీ మాన మేఘ శ్రేణి విరియంగఁ - దొగ ఱెల్లుగుంపులు తొంగలింప, సాంధ్యరా గావిల చంద్రికాంబులు దేఱ - నిరుల మొత్తపు టస లివురఁ బాఱ, యువజన రాగ పయోరాసు లుప్పొంగ - వెలిదమ్మి జాజిపువ్వులు ముడుంగ, మద చకోర మరాళ మండలి చెలరేఁగఁ - బఱచు చేడియ లను మెఱపు లడఁగ |
|
| తే. |
నభినవ శర త్సమాగమం బనఁగ మించు నట్టి రాకా నిశా వేళ నలరువింట గొనయ మెక్కించి వలరాజు కినుక మీఱ విరహి జనములపై దండువెడలె, నపుడు. |
50 |
| ఉ. |
ఆ నలినాయతాక్షు గడియారమునం దభిసారికా జిఘాం సా నిరత ప్రసూనశర చాప గుణ ధ్వనులో యనంగ ఘం టానినదంబు లయ్యెడ వినంబడియెం గుపితాబ్జలోచనా మానసము ల్చలింపఁ బ్రథమ ప్రహరాపగమ ప్రశంసు లై. |
51 |