| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| నక్షత్ర వర్ణనము | ||
| సీ. |
కార్కొన్న కటికచీఁకటి మొగు ల్మొత్తంబు - గురిసిన వడగండ్ల గుంపు లనఁగఁ, గవ జక్కవలు వాయఁ గరనాళములఁ జందు - రుం డూఁదు పటికంపు టుండ లనఁగ, నెల్లెడ మిన్నేటి యిసుమున నచ్చర - కొమ లిడ్డ వెన్నెలకుప్ప లనఁగ, దెలివి వెన్నెల వెండితీఁగలు నిగిడించు - చదలు కమ్మచ్చు బెజ్జము లనంగ, |
|
| తే. |
జగము గెల్వంగ దండెత్తు మగని మీఁద లీల రతి చల్లు దీవనఁ బ్రాలనంగ, వేఁడివెలుఁ గెండఁ గ్రాఁగిన విన్ను మేన నెక్కొను చెమటబొట్లు నాఁ జుక్కలమరె. |
37 |