| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| సాయం సంధ్యా వర్ణనము | ||
| ఉ. |
ఆయత తేజము ల్దఱిఁగి యంబుజబాంధవుఁ డస్తసీమకుం బోయినఁ జూచి వేచిన తమోవిభుఁ డంప దినాంతయోధుఁ డీ చాయఁ దదీయపత్నిఁ బెలుచం బడ నీడిచికొంచుఁ బోయెడిం గో యనుమాడ్కి నంతట శకుంత రవంబు సెలంగె నెల్లెడ\న్. |
30 |
| చ. |
ఇనుదెసఁ జూడ నోడి తల లెత్తక నీటఁ దదీయబింబముం గని వగ జక్కవ ల్మొగ మొగంబులు సూచుచుఁ గుంది మూర్ఛఁజెం దినదెసఁ జూడలేక జలదేవత హా! యని కన్ను మోడ్చెనా వనరుహము ల్ముడింగె; సహవాసుల దుఃఖము నెయ్యు రోర్తురే! |
31 |
| చ. |
తనువున నంధకారపు మదం బల మి న్నను భద్రదంతికి న్మొనసినఁ, జిందరేఁగి తపసుం డను మావుతుఁ గ్రుంకుమెట్టలో యనురల వైచిన న్నొగిలి యచ్చట నెత్తురు గ్రక్కెనో! యనం గనుఁగవ గోరగింపఁ బొడకట్టె సముజ్జ్వల సాంధ్య రాగముల్. |
32 |
| మ. |
ఒక భృంగంబు పరాళినీ మదన తంత్రోన్మాది ప్రాణేశ్వరి\న్ మకరం దాసవ మత్త నబ్జగృహ సీమం బెట్టి తాఁ బోయి సం జకడ న్వచ్చి త దానమ న్ముకుళ మేజాడం జొర న్రాక, యా మికుఁడోనాఁ దిరిగెం; గొలంకు రమకు\న్ మే లెంత హీనంబొకో! |
33 |