| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| నారదుని వీడుకోలు | ||
| క. |
అని పలికి శౌరిఁ గనుఁగొని దనుజాంతక! పోయివచ్చెదను మఱవకుమీ నను నావుడు గోపవధూ జన వంచకుఁ డనియెఁ గార్యసంఘటనేచ్ఛ\న్. |
27 |
| చ. |
అదితి మొఱంగి కుండలము లా నరకుండు హరించె, వాని నేఁ గదనములోనఁ ద్రుంచి యవి కైకొని దాఁచితి నాఁటనుండియుం బదిలముగాఁగ, నన్నడుగఁ బంపనికారణమేమి? లాఁతినే? యిదె చనుదెంచి యిత్తు ననుమీ శతమన్యునితోడ సంయమీ! |
28 |
| చ. |
అని వినయంబుతోడఁ గలహాశన సంయమి వీడుకొల్పి యం గనయును దాను నచ్చట జగత్పతి జూదపువేడ్కనున్నచో దినకర మండలం బపర దిగ్గిరికూటముఁ జేరె యాదవీ జన మదిరా రసారుణ విశాల దృగంచల వంచక చ్ఛవి\న్. |
29 |