| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| సత్యభామకు నారదాశీర్వాదము | ||
| వ. | ఇ ట్లనియె. | 23 |
| మ. |
పతి నీవై విహరింపఁగా, జనము సంభావింపఁగా, బంధు సం తతి నిన్నుం గొనియాడఁగా, సవతికాంత ల్సూచి లజ్జింపఁగా, సతుల ప్రాభవ వైభవోన్నతుల ప్రోవై యిట్లు వర్తించు నీ కితరస్త్రీజన బుద్ధి దీవనలు నే నే మిచ్చెద న్మానినీ! |
24 |
| మ. |
అనికైనం బతి నిన్నుఁ బాపి చనునో! ప్రాణంబు ప్రాణంబుగా నిను మన్నింపఁడో! నీ మనోరథముల న్నెయ్యంబుతోఁ జేయఁడో! చనవు ల్నీవలె నెవ్వరే గఁనిరో! నీసౌభాగ్య మింతింతయే! నినుఁబోలం గల రబ్జగంధు లన వింటే, యెందు సాత్రాజితీ! |
25 |
| క. |
అటు లైనను గాని మ్మో కుటిలాలక! నీకు మగఁడు కోరిన కోర్కుల్ ఘటియించుఁగాక, తా నెం తటి కార్యంబైన డించి, నాదీవనల\న్. |
26 |