| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| పారిజాతాపహరణము - ప్రథమాశ్వాసము | ||
| వ. |
అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనిన పారిజాతాపహరణం బను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన. |
34 |
| కావ్యావతారిక | ||
| క. |
జనమేజయ జనవల్లభుఁ డను దినమును హరికథా సుధాస్వాదనమునం దనివి సనక వైశం పాయన మునికిట్లనియెఁ, గౌతుకాయత్త మతిన్. |
35 |
| సీ. |
హరివంశ కథ లెల్ల నానుపూర్విగ నిట్టు - విని కృతార్థుఁడ నైతి మునివరేణ్య! యా దానవారాతి యమరులఁ బ్రోవంగఁ - బూని యా యదువంశమున జనించె నతఁడు గ్రమ్మఱ వారి కాధార మగు పారి - జాతంబు పుడమి కేరీతిఁ దెచ్చె? ననుమతి నిచ్చిరో! యా వేల్పు, లొండేని, - బలిమిఁ జేకొనియెనో! పాడి దొఱఁగి, |
|
| తే. |
తెలియ నానతి యిమ్ము సందియము దీఱ వినఁగ వేడుక యయ్యె సవిస్తరముగ ననిన నా వ్యాసముని శిష్యుఁడతనితోడ నధిప! విను మని పలికె నత్యాదరమున. |
36 |