| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | అవతారిక |
| షష్ఠ్యంతములు | ||
| క. |
ఏవంవిధ గుణ ఖనికిని ద్యోవనితా ప్రార్థ్యమాన ధూర్తారి ధరి త్రీవర సంగతి సుభగం భావుక రణ ముదిత కలహ పారణ మునికి\న్. |
25 |
| క. |
రాధా తన యాధారిత గాథాధఃకరణ నిపుణ కర సదయునకు\న్ మేధావదసాధారణ బోధాకర హృదయునకు విబుధ సదయునకు\న్. |
26 |
| క. |
నాగాంబికా కుమారున కాగామి గతాధునిక నృపాలభ్యయశ శ్శ్రీగుంభ హసిత హిమగు ది శాగజ తను కటజ నైల్య సంభారునకు\న్. |
27 |
| క. |
సామర్ష దళిత పరభట సామజ హయ కూల ముద్రుజ క్షతజ ధునీ కాముకితాఖిల జలధికి నాముష్యాయణ సుధీ గృహాంగణ నిధికి\న్. |
28 |
| క. |
కోదండ ద్రోణునకును వేదార్థ స్థాపన ప్రవీణునకు సమి న్నేదిష్ఠ విమత తరసా స్వాదన వశ తుంద పరిమృజ కృపాణునకు\న్. |
29 |
| క. |
అసుహృదసుపవన విసర గ్రసనరస వ్యసన వశ వికసదసి రసనా ప్రసరణ శయఫణ విలసన విసృమర మరువకిత సమర వీథీస్థలికి\న్. |
30 |
| క. |
వైంధ్య ద్విప గంధ నిబ ద్ధాంధ్యాళి ప్రతిపదోదితాలయ విభవా వంధ్య ప్రబంధకృతి సం బంధ్యనుభావునకు బుధిత మనుభావునకు\న్. |
31 |
| క. |
వనితా జనతా స్మరునకు ఘన తాప నితారకాభిక ద్యుచరగవీ ఘన తాయన కారక స త్పనితాత్మ నితాంత దాన పరతంత్రునకు\న్. |
32 |
| క. |
పరిపంథి దోర్బల సమి త్పరివర్ధిష్ణు ప్రతాప దహనారణికి\న్ సరసకళాధోరణికి\న్ నరసాధిప కృష్ణరాయ నాయకమణికి\న్. |
33 |