| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | అవతారిక |
| కృతిపతి కృష్ణదేవరాయల శౌర్య ప్రతాపములు | ||
| శా. |
వీర శ్రీనరసింహశౌరి పిదప న్విశ్వంభరా మండలీ ధౌరంధర్యమున\న్ జనంబు ముదమంద న్నాగమాంబా సుతుం డారూఢోన్నతిఁ గృష్ణరాయఁడు విభుండై రత్న సింహాసనం బారోహించె, విరోధులు న్గహన శైలారోహముం జేయఁగ\న్. |
16 |
| సీ. |
యాదవత్వమున సింహాసనస్థుఁడు గామి - సింహాసనస్థుఁ డై చెన్ను మెఱయ గొల్ల యిల్లాండ్రతోఁ గోడిగించుటఁ జేసి - పరకామినీ సహోదరతఁ జూప మఱి జరాసుతునకై మథుర డించుటఁ జేసి - పరవర్గ దుర్గము ల్బలిమిఁ గొనఁగఁ బారిజాతము నాసపడి పట్టి తెచ్చుట - నౌదార్యమున దాని నడుగు వఱుపఁ |
|
| తే. |
గోరి, తొలుమేనఁ దనకైన కొదువ లెల్ల మాన్చుకొన వచ్చి భువనైక మాన్యలీల నవతరించిన కృష్ణుఁడౌ ననఁగ మించె నరసవిభు కృష్ణరాయ భూనాయకుండు. |
17 |
| శా. |
శ్రీరంగేశ్వర నాభి పంకజ రజశ్శ్రీకంటెఁ, జోళేంద్ర త న్వీ రాజ త్కుచపాళి కుంకుమముకంటె, న్సహ్యభూభృత్తటీ నీరంధ్రీకృత గైరిక ద్రవముకంటె, న్వన్నె గావించెఁ గా వేరీ తోయముఁ గృష్ణరాయఁ డహితోర్వీనాథరక్త ప్రభ\న్. |
18 |
| సీ. |
చక్రవర్తి మహా ప్రశస్తి నాఁడును నేఁడు - చెలఁగి ధర్మ క్రమ స్థితి ఘటించె భూభృదుద్ధరణ విస్ఫూర్తి నాఁడును నేఁడు - గో రక్షణ ఖ్యాతిఁ గుదురు పఱిచె సాధు బృందావన సరణి నాఁడును నేఁడు - వంశానురాగంబు వదలఁ డయ్యె సత్యభామా భోగసక్తి నాఁడును నేఁడు - నాకల్ప మవని నింపార నిలిపె |
|
| తే. |
నాఁడు నేఁడును యాదవాన్వయమునందు జనన మందెను వసుదేవ మనుజవిభుని కృష్ణుఁ డను పేర నరసేంద్రు కృష్ణదేవ రాయఁ డనుపేర నాదినారాయణుఁడు. |
19 |
| చ. |
అలఫణి భోగ రత్నములు నాదిగిభోత్కట గండ గంధముల్ తలఁపునఁ బాఱి నవ్వు వసుధాసతి, దా భుజకీర్తి మౌక్తిక చ్ఛలమునఁ గృష్ణరాయ నృపచంద్రుని బాహువునందు భూషణో జ్జ్వలమణుల న్మృగీమదము వాసనయుంగని, ధూర్త లంగనల్. |
20 |
| చ. |
మునుకొని కొండవీట నతిమూఢత రుద్రుఁడు కృష్ణనందను\న్ మనసిజుని\న్ జయించె; నది మానుషమే! నరసేంద్రుకృష్ణరా య నృపతి కొండవీట శరణాగతుఁడైన ప్రతాపరుద్ర నం దనుఁడగు వీరభద్రుఁ గదనంబునఁ గాచె జగత్ప్రసిద్ధిగ\న్. |
21 |
| చ. |
నెలకొని కృష్ణరాయ ధరణీపతి యుత్కల భూమిపాలుతోఁ గలన నెదిర్చి హస్తికరకాండ తతు ల్మసకంపుఁ బాములై మలసినచోటఁ గూడిన సమగ్ర యశోవసనంబు గప్పి తా వలవఁగ జేసె భూసతిని, వశ్యవిధిజ్ఞుఁడు గాన నేర్పున\న్. |
22 |
| సీ. |
ఉదయాద్రి వేగ యత్యుద్ధతి సాధించె, - వినుకొండ మాటమాత్రాన హరించెఁ, గూటము ల్సెదరంగఁ గొండవీ డగలించె, - బెల్లముకొండ యచ్చెల్లఁ జెఱిచె, దేవరకొండ యుద్వృత్తి భంగము సేసె, - జల్లి పల్లె సమగ్రశక్తి డులిచెఁ, గినుక మీఱ ననంతగిరి క్రిందుపడఁ జేసె, - గంబంబుమెట్ట గ్రక్కనఁ గదల్చె |
|
| తే. |
బలనికాయము కాలిమట్టులనె యడఁచుఁ గటకమును నింక ననుచు నుత్కలమహీశుఁ డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు రాజమాత్రుండె! శ్రీకృష్ణరాయవిభుఁడు. |
23 |
| సీ. |
బాహు సౌధ క్రీఁడ బరఁగు పంతవలంతి - తొయ్యలి నిడుద కస్తూరి బొట్టు, వైరిసైన్యాబ్ధిలో వచ్చు గెల్పుల నావఁ - గడఁ జేర్చు ప్రాఁకుడుఁ గడపుఁ జేయి, యరి కుంభి కుంభ ముక్తాక్షరాంకిత మగు - జయ రమా కన్యక చదువు పలక, శత్రురాజులకు నచ్చరల నాకర్షించు - సమరేంద్రజాల పింఛంపుఁ గుంచె |
|
| తే. |
మేను సగము యశో మహేశానునకును, శౌర్యరవిఁ గోరి వచ్చిన చాయలేమ, నరసవిభు కృష్ణరాయ భూనాథచంద్రు చేత ననిలోన మించు కౌక్షేయకంబు. |
24 |