| శతకములు | సంపఁగిమన్న శతకము |
|
| క. |
మండితపూర్ణసుధాకర మండలశతకోటికాంతిమహనీయుండై నిండి తనలోన యోగి ప్ర చండగతి న్వెలుఁగు నన్న సంపఁగిమన్నా! |
21 |
| క. |
పేరుకొనుమంత్రవాదము భారం బది కుక్కనోటిపాఁతై రోఁతై పోరై యారై దూఱై జాఱఁగవలె సుప్రసన్న! సంపఁగిమన్నా! |
22 |
| క. |
బూటకములు వేషంబులు నాటకములు మంత్రతంత్రనటనలు మిథ్యా పేటిక లవి యోగికి జం జాటము లివి యేటి కన్న! సంపఁగిమన్నా! |
23 |
| క. |
చలపట్టియు హఠయోగముఁ దలపెట్టిన వట్టిగొడ్డుతాఁకట్టింతే యలసిద్ధి దొరక దడియా సలుగా కిందేమియున్నె! సంపఁగిమన్నా! |
24 |
| క. |
సంతతయోగానందా నంతసుఖాంభోధి నలరు నాతనిభాగ్యం బింతింతనఁ దరమా ఘన సంతోషము జగతి నెన్న సంపఁగిమన్నా! |
25 |
| క. |
నావయగు\న్ భవజలధికిఁ ద్రోవయగు\న్ ముక్తికాంతతోఁ గూడుటకు\న్ కేవలనిజదేశిక ర క్షావహ మగుయోగ మెన్న సంపఁగిమన్నా! |
26 |
| క. |
అభ్యుదయంబుగ నీయో గాభ్యాసము సేయవలయు నతులితలీలన్ లభ్యుఁ డగుం బరమాత్ముఁడు సభ్యుల కది మార్గ మన్న! సంపఁగిమన్నా! |
27 |
| క. |
వ్యక్తావ్యక్తపదం బఁట ముక్తఁట గురుసేవ తనకు మును లేదఁట యే యుక్తిని గనుఁగొనవచ్చు న శక్తులకును సుప్రసన్న! సంపఁగిమన్నా! |
28 |
| క. |
భావమునం గననేరని జీవుల కిది బీరకాయ చి క్కగుఁ దెలియం గావశమే సద్గురు దీ క్షావిధి యొనఁగూడకున్న సంపఁగిమన్నా! |
29 |
| క. |
బోధింపఁదగినగురువుల శోధించి తదంఘ్రిఁ జేరి సుస్థిరమతి యై యాధేయము నాధారము సాధించిన ముక్తుఁడౌను సంపఁగిమన్నా! |
30 |