| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| శ్రీకృష్ణుఁ డింద్రు నూరార్చుట | ||
| ము. |
లెమ్ము సురేంద్ర! నీవలన లే దొకతప్పును, నీమఱంద లీ కొమ్మ వదాన్యభూరుహముఁ గోరినఁ దెచ్చితిఁగాని; కొమ్ము నీ సొ మ్మని వజ్రమిచ్చి మధుసూదనుఁ డాతరు వీఁ దలంచినం గ్రమ్మఱ మ్రొక్కి వాసవుఁడు కందళిత ప్రమదాంతరంగుఁడై. |
39 |
| ఉ. |
సొమ్మన నెద్ది! యే ననఁగ సొమ్మున కెవ్వఁడఁ! గర్తవీవు, నీ సొ మ్మఖిల ప్రపంచమును, శూరకులంబు నలంకరించు నీ వమ్మహి నుండునంతకు ననన్యదురాపము పారిజాతభూ జమ్మును నుండు నన్న వికసన్ముఖుఁడై హరి వీడుకొల్పుచు\న్. |
40 |
| శా. |
గంధ ర్వోరగ సిద్ధ సాధ్యవరులం గారుణ్య దృష్టి క్రియా సంధానంబున వీడుకొల్పి, సురభూజంబు న్సతి న్వాహన స్కంధాగ్రంబున నుంచి, విక్రమకళా సంలబ్ధ తత్ప్రేయసీ సంధాసిద్ధిఁ గృతార్థుఁ డై మఱలె నిచ్ఛ న్వేడ్క లుప్పొంగఁగ\న్. |
41 |
| ఉ. |
వాసవుతోడి కయ్యమున వార్తలు సెప్పుచు, మోముఁదమ్మి ను ల్లాసము మందహాసముఁ దొలంకఁగ వేలుపుమ్రాని పూవులం జేసిన సొమ్ము లంగములఁ జేర్చి వధూమణి నాదరించుచు\న్ వాసుకిభోగతల్పుఁడు సువర్ణగిరీంద్రము దాఁటెఁ జయ్యన\న్. |
42 |